పాపం రష్మిక కు పెద్ద దెబ్బె పడింది…!

రష్మిక మందన… ఈ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మూడేళ్ళు కాకుండానే స్టార్ హీరోయిన్ అయిపొయింది ఈ బ్యూటీ. ‘ఛలో’ ‘గీత గోవిందం’ వంటి వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లు అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత ‘దేవదాస్’ ‘డియర్ కామ్రేడ్’ వంటి క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించింది. ఆ వెంటనే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఛాన్స్ ధక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం… ఆ తరువాత నితిన్ తో చేసిన ‘భీష్మ’ కూడా సూపర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ అయిపొయింది.

ఇప్పుడు దాదాపు ఈమెను జూనియర్ సమంత అనేస్తున్నారు. అయితే లాక్ డౌన్ వల్ల ఈమెకు పెద్ద దెబ్బె పడిందట. అసలు మ్యాటర్ ఏంటంటే… ఈ ఏడాది ఒక బ్లాక్ బస్టర్ అలాగే ఓ సూపర్ హిట్టు దక్కింది కాబట్టి.. ఎలాగైనా తన రెమ్యూనరేషన్ రెండు కోట్లు చేసుకోవాలి అని భావించిందట. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు గతేడాది నవంబర్ లోనే సైన్ చేసిందట. కాబట్టి ఆ చిత్రానికి కోటి పారితోషికం మాత్రమే అందుతుంది.

ఈ ఏడాది సైన్ చేసి ఉంటే మరో 50 లక్షల్లో లేదా మరో కోటో రాబట్టుకునే ఛాన్స్ ఉండేది. పోనీలే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కు ట్రై చేద్దాం అనుకుంటే… లాక్ డౌన్ ఎఫెక్ట్ అందులోనూ ఓవర్సీస్ మార్కెట్ ప్రతీ సినిమాకి దెబ్బపడుతుంది కాబట్టి.. హీరోలతో పాటు హీరోయిన్ లకు కూడా కాస్ట్ కటింగ్ లు పడనున్నట్టు తెలుస్తుంది. దీంతో రెండు కోట్లు డిమాండ్ చేద్దాం అనుకున్న రష్మిక ఆశల పై నీళ్ళు జల్లినట్టయ్యింది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus