అనుకున్నంతా అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ మళ్ళీ వాయిదాపడింది. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ నిర్మాత దానయ్య తాజా ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ చెప్పినట్లుగా జనవరి 8, 2021లో వచ్చే అవకాశం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ 30 శాతం వరకు పెండింగ్ ఉంది, ఈ పరిస్థితులలో ఇంత త్వరగా షూటింగ్ పూర్తి చేయడం సాధ్యం కాదని ఆయన ఉన్న విషయం చెప్పారు.
ఇక కొన్ని ప్రత్యేక అనుమతులు తీసుకొని భారీ భద్రతా చర్యల మధ్య, సాధ్యమైనంత తక్కువ మందితో షూటింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు దానయ్య చెప్పారు. కాగా మరి సంక్రాంతికి రాకపోతే ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు విడుదల అవుతుందన్న ప్రశ్నకు దానయ్య చాల దగ్గరలోనే విడుదల తేదీ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ జులై 2020 నుండి జనవరి 2021కి వాయిదా వేశారు. మరలా వాయిదా అటు ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
ఆర్ ఆర్ ఆర్ హీరోలకు గాయాలు, రాజమౌళి కుమారుడు పెళ్లి, బాహుబలి మూవీ లండన్ స్క్రీనింగ్ వంటి అవరోధాల వలన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లేటైంది. ఈసారైనా చెప్పిన టైం కి వద్దాము అనుకుంటే, కరోనా రూపంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంత భారీ బడ్జెట్ మూవీ విడుదల వాయిదాపడితే అది నిర్మాతకు చాలా నష్టాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.
Most Recommended Video
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు