ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతికను ప్రధాన పాత్రలో పెట్టి ‘పొన్‌మగల్ వందాల్’ చిత్రాన్ని నిర్మించాడు. జె.జె.ఫ్రెడ్రిక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. నిజానికి మార్చి 27న థియేట్రికల్ రిలీజ్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. కానీ ఓ వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ప్రభుత్వం… ఇండియా వైడ్ లాక్ డౌన్ నిర్వహించడంతో ఈ చిత్రాన్ని నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్లో విడుదల చెయ్యాలి అని నిర్మాత సూర్య డిసైడ్ అయ్యాడు. అయితే దీనికి థియేటర్ యాజమాన్యం నుండీ ప్రతి కూలత నెలకొంది.
థియేట్రికల్ రిలీజ్ ఇస్తామని ఒప్పందం చేసుకుని ఇప్పుడు ఇలా ఓటిటికి రిలీజ్ చెయ్యడం ఏంటి? అని వారు నిరసన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే ‘సూర్య సినిమాలను బ్యాన్ చేస్తాం’ అని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళం థియేటర్ యాజమాన్యం సైతం ఇలాగే స్పందించారు. ఈ క్రమంలో సూర్య ‘ఇప్పటికే ఈ చిత్రం నిర్మాణానికి అయిన ఖర్చుతో పాటు.. నెల నెల వాటికీ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని’ ఆవేదన వ్యక్తం చెయ్యడంతో కొందరు నిర్మాతలు సూర్యకు అండగా నిలిచారు.
మొత్తానికి సినిమాని ఓటిటిలో విడుదల చేశారు. ‘సినిమా అద్భుతం.. జ్యోతిక నటన అద్భుతమంటూ’ రాధికా శరత్ కుమార్, విగ్నేష్ శివన్ వంటి సెలబ్రిటీలు ట్వీట్ చేశారు. అయితే విడుదలైన కొన్ని గంటల్లోనే ‘పొన్‌మగల్ వందాల్’ చిత్రం ఆన్లైన్ లో లీక్ అయ్యింది. ఓటిటి సబ్స్క్రైబర్స్ మాత్రమే కాకుండా ఈ చిత్రాన్ని మిగిలిన వారు కూడా ఫ్రీగా చూసేస్తున్నారు. డౌన్ లోడ్ చేసుకుని తమ మొబైల్స్ ద్వారా మిగిలిన వారికి షేర్ చేస్తున్నారు. దీంతో సూర్య, జ్యోతిక లకు పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి.మరి దీని పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..!