తెలుగు ప్రజలు విడిపోవడం పెద్ద దెబ్బె పడిందిగా..!

  • January 28, 2020 / 06:09 PM IST

అవును.. ప్రస్తుతం టాలీవుడ్ ను పట్టించుకునే వాళ్ళే లేరని.. చిత్ర సీమ కోడై కూస్తుంది. వివరాల్లోకి వెళితే ఇటీవల ‘పద్మ’ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో తెలుగు నటులకి ఒక్క అవార్డు కూడా దక్కలేదు. దీనికి ప్రధాన కారణం మన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే అన్నది బహిరంగ రహస్యం. గతంలో టి.సుబ్బిరామి రెడ్డి, దాసరి నారాయణ రావు వంటి పెద్దలు.. ఏదో ఒకరకంగా మన తెలుగు నటులకి ‘పద్మ’ అవార్డుల విషయమై రెఫర్ చేసేవారట. కానీ ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయో అప్పటి నుండీ ఈ విషయం మరింత పెద్దదైంది. కనీసం నందీ అవార్డుల ప్రధానోత్సవం కూడా జరగడం లేదు.

గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు… నంది అవార్డులు ప్రధానోత్సవం నిర్వహించే వారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ ఆ ప్రభుత్వానికి చెందిన వారే కాబట్టి అప్పుడు చాలా ఈజీగా ఉండేదట. ఇక అటుతరువాత ‘కాంగ్రెస్ ప్రభుత్వం’ వచ్చినప్పుడు కూడా నంది అవార్డులు ప్రధానోత్సవం జరిపారు. కానీ 2014 లో తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో ఈ సమస్య పెరిగింది. అప్పటి నుండీ తెలుగు కళాకారులని పట్టించుకునే వారే లేరు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.. ‘సింహా’ అవార్డుల ప్రదానోత్సవానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు అప్పట్లో ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రం.. సినీ కళాకారుల్ని పట్టించుకోవట్లేదు. ‘వై.సి.పి’ గెలిచిన తర్వాత చిత్ర పరిశ్రమ నుండీ ఒక్కరు కూడా వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు తెలుపలేదు. ఈ విషయం పై అప్పట్లో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఓ మాటకి వస్తే తప్ప.. చిత్ర సీమ పరిస్థితి ఇంతేనేమో..!

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus