టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న అతికొద్ది మంది డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. అటు సీనియర్ హీరోలతో ఇటు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి పని చేస్తూ అనిల్ రావిపూడి సత్తా చాటుతున్నారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3 సినిమాలు భిన్నమైన కథాంశాలతో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే.
అయితే ఇదే సమయంలో ఈ సినిమాలు సక్సెస్ సాధించడంలో కామెడీ సన్నివేశాలు కీలక పాత్రలు పోషించాయి. అయితే బాలయ్య సినిమా ఒక విధంగా అనిల్ రావిపూడికి అగ్నిపరీక్షే అని చెప్పవచ్చు. తన శైలికి భిన్నమైన కథను ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ఎంపిక చేసుకున్నారు. అదే సమయంలో ఎఫ్3 సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించినా మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఎఫ్2 సినిమా స్థాయిలో ఎఫ్3 మూవీ అలరించలేదని పలువురు సెలబ్రిటీలు సైతం బహిరంగంగానే ప్రకటించారు. గతంలో పలువురు డైరెక్టర్లు కామెడీ కథాంశాలతో కెరీర్ తొలినాళ్లలో విజయాలను అందుకున్నా ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఎదురుకావడంతో ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనిల్ రావిపూడి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
రాజమౌళి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ అయినప్పటికీ చాలామంది స్టార్ హీరోలు అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టకపోవడం కూడా ఈ దర్శకుని కెరీర్ కు ఒకింత మైనస్ అవుతోంది. మరోవైపు అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!