Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

ఫ్లాప్‌ సినిమా ఇచ్చిన స్టార్‌ హీరోకి హిట్‌ సినిమా ఇవ్వడం చాలా కష్టం. దానికి దర్శకుడు చాలా కష్టపడాలి. అదే బ్లాక్‌బస్టర్‌ ఇవ్వాలంటే ఇంకా కష్టపడాలి. ఈ టాలెంట్‌ చాలా కొద్దిమంది దర్శకులకే ఉంటుంది. రీసెంట్‌గా యువ దర్శకుడు సుజీత్‌ ఈ పని చేసి చూపించారు కూడా. అయితే బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన హీరోకు.. ఆ తర్వాతి సినిమాను కూడా బ్లాక్‌బస్టర్‌ ఇవ్వాలి అంటే ఇంకా ఇంకా కష్టపడాలి. ఇప్పుడు ఇదే పరిస్థితిలోకి వచ్చారు ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ఇప్పుడు ఆయనకు వస్తున్న రిక్వెస్ట్‌లు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది.

Harish Shankar

పవన్‌ కల్యాణ్‌తో హరీశ్‌ శంకర్‌ ఇప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల పవన్‌ ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేశారు. దీని కోసం స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసి టీమ్‌.. ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్యాచ్‌ వర్క్‌, డబ్బింగ్‌ తప్ప పవన్‌తో టీమ్‌కి ఇంకా ఏ పనులు లేవట. అయితే మిగిలిన నటులతో కొన్ని సీన్స్‌ తీయాల్సి ఉంది. దీంతో ఈ పనులు అన్నీ పూర్తి చేసుకొని నెమ్మదిగా వచ్చే సమ్మర్‌లో సినిమాను రిలీజ్‌ చేద్దామని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ అనుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ‘ఓజీ’ సినిమా సాధించిన విజయం.. అందులో పవన్‌ కల్యాణ్‌ను సుజీత్‌ చూపించిన విధానం చూశాక హరీశ్‌ శంకర్‌ మరోసారి సినిమా మీద వర్క్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఎందుకంటే సుజీత్‌ తన ఫ్యానిజం మొత్తం చూపించారు కాబట్టి.. ఇప్పుడు హరీశ్‌ శంకర్‌ తన సీనియారిటీని ఇంకాస్త బలంగా చూపించాలి అని కోరుకుంటున్నారు. అయితే ‘ఓజీ’ విజయాన్ని ముందుగానే పసిగట్టిన హరీశ్‌ ఆ మేరకు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లో సీన్స్‌ రాసుకున్నారు అని చెబుతున్నారు.

‘ఓజీ’ సినిమాలో పూర్తిగా పవన్‌ ఎలివేషన్లు, యాక్షన్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌ మీదనే దృష్టి పెట్టగా.. హరీశ్‌ శంకర్‌ మొత్తంగా సినిమాను తన స్టైల్‌లో చూపించేలా రాసుకున్నారని టీమ్‌ చెబుతోంది. ఏదైనా ‘ఓజీ’ విజయం హరీశ్‌ శంకర్‌కి ఆనందంతోపాటు.. ఓ పెద్ద బాధ్యతను కూడా తీసుకొచ్చి పెట్టింది అని చెప్పొచ్చు.

‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus