మహేష్ బాబు గురించి ఎవ్వరికీ తెలియని విషయాన్ని బయటపెట్టిన ‘బిగ్ బాస్4’ దివి..!

‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ లలో దివి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ షోకి వచ్చే ముందు వరకూ ఈమె గురించి ఎవ్వరికీ పెద్దగా తెలీదు. ఇక షోలోకి ఎంటర్ అయిన తరువాత మొదటి వారం రోజులు ఈమె నోరు విప్పి మాట్లాడింది లేదు. అయితే రెండో వారం నుండీ కొంచెం బెటర్ లెండి. అయితే దివి.. మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకూ మహేష్ బాబుకి సంబంధించి ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది దివి.

ఆమె మాట్లాడుతూ.. “మహేష్ సర్ అందం గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. ఆయన చాలా అందగాడు…ఒక్కసారి చూస్తే అలా చూస్తూనే ఉండిపోవాలనిపించే ఫేస్ అతనిది. ముట్టుకుంటే మాసిపోతారేమో అని కూడా అనిపిస్తుంది. ఆయన్ని చూడకముందు అందరి అమ్మాయిల మాదిరే నేను కూడా చాలా ఊహించుకున్నాను. అంత అందగాడు అందులోనూ పెద్ద స్టార్ హీరో ఈయన అసలు మనతో మాట్లాడతాడా అనుకునే దాన్ని. కానీ ఆయన చాలా నార్మల్‌గా మాట్లాడేసరికి నేను థ్రిల్ అయ్యాను.నేను హీరోయిన్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను చాలా రోల్స్ వదిలేశాను. కానీ ‘మహర్షి’ చేశాక ఒకే సారి హీరోయిన్ అవ్వడం కంటే ఇలాంటి పాత్రలు చెయ్యడం బెటర్ అనిపించింది.

‘మహర్షి’ సెట్‌లో 20 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్లు కూడా ఉండేవారు. కానీ వాళ్లంతా మహేష్ సర్ ముందు తేలిపోయేవాళ్ళు. ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకరోజు మా ఇద్దరి పై మాంటేజ్ షాట్ తీస్తున్నారు.. ఆ సమయంలో మమ్మల్నిద్దరినీ ఒకచోట నిలబెట్టి ఏదొకటి మాట్లాడుకోమన్నారు. మేం మాట్లాడుకుంటున్న ప్లేస్ లో.. గాలి గట్టిగా వచ్చింది. ఆ టైంలో మహేష్ సర్ హెయిర్ ఎగిరింది. అప్పుడు నేను ఆయన నుదురుపై ఉన్న పుట్టుమచ్చను చూశాను. వావ్ సో బ్యూటిఫుల్ సార్ అని మహేష్ సార్‌కి చెప్పా.. నా కూతురు సితారకు కూడా అదే ప్లేస్‌లో పుట్టుమచ్చ ఉంటుందని మహేష్ సర్ అన్నారు” అంటూ దివి చెప్పుకొచ్చింది.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus