ఈసారి రూటు మార్చిన ‘బిగ్ బాస్4’ యూనిట్..!

తెలుగునాట ‘బిగ్ బాస్’ ఎంతటి ఆదరణ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసి శుభారంభాన్నిచ్చాడు. ఇక రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని బాగా హోస్ట్ చేసినప్పటికీ.. కొన్ని కాంట్రవర్సీలు చోటు చేసుకోవడంతో.. అతని పై నెగిటివిటీ పెరిగేలా చేసింది. దీంతో 3 వ సీజన్ ను మళ్ళీ ఎన్టీఆర్ తో చేయించాలి అని ‘బిగ్ బాస్’ టీం భావించినప్పటికీ.. ‘ఆర్.ఆర్.ఆర్’ వల్ల కుదర్లేదు. అంతేకాదు రెండో సీజన ఎఫెక్ట్ తో.. ఎవ్వరూ చేయడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో నాగార్జునను ఎంచుకున్నారు. వారంలో రెండు రోజుల పాటు హోస్ట్.. హౌస్ లోని కంటెస్టెంట్ లతో ఇంట్రరాక్ట్ అవ్వాలి. ఆ టైములో వారు చేసిన తప్పుల్ని వారికి తెలియజేయాలి.

అయితే వారిలో ఎవ్వరిని తప్పు పట్టినా.. హోస్ట్ పై విమర్శలు వస్తాయి. అందుకే ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ నాగార్జున ఎంతో సున్నితంగా కంటెస్టెంట్ లను మందలించేవారు. సీనియర్ స్టార్ హీరో.. అందులోనూ ఇండస్ట్రీలో పెద్ద మనిషి కాబట్టి.. ఫినాలేకు కూడా ఎంతో మంది సెలబ్రిటీలను తీసుకొచ్చి.. ఓ రేంజ్ టి.ఆర్.పి ని నమోదు చేసేలా చేశారు నాగార్జున. అయితే సీజన్ 4 ను ఎవరు హోస్ట్ చేస్తారు అనే డిస్కషన్లు కూడా మొదలైపోయాయి. జూన్ లేదా జూలై నుండీ సీజన్ 4 మొదలవుతుంది కాబట్టి హోస్ట్ ఎవరు చేస్తారు అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఇప్పుడు చేసే అవకాశం లేదు… ఎందుకంటే ‘ఆర్.ఆర్.ఆర్’ ఫినిషింగ్ స్టేజి లో ఉంది. ఈ క్రమంలో చిరంజీవి, వెంకటేష్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వంటి వారిని ‘బిగ్ బాస్’ యూనిట్ సభ్యులు సంప్రదించారట. కానీ వారు అంత ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. అయితే అందుతున్న తాజా సమాచారం మేరకు.. మళ్ళీ నాగార్జునని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. మొదటి మూడు సీజన్లు లానే.. ఈ సీజన్ కు కూడా మరో హీరో హోస్ట్ చేస్తాడు అని అనుకున్నవారికి.. ఈ సారి షాక్ తగిలినట్టే. మరి ఈ విషయంలో ఎంతవరకూ నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus