Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: 24 వరోజు రివ్యూ – దొంగల జోడీ… ఇంట్లో గొడవల వేడి!

బిగ్‌బాస్‌ 4: 24 వరోజు రివ్యూ – దొంగల జోడీ… ఇంట్లో గొడవల వేడి!

  • October 1, 2020 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: 24 వరోజు రివ్యూ – దొంగల జోడీ… ఇంట్లో గొడవల వేడి!

బిగ్‌బాస్‌ ఇంట్లో ‘నన్ను మించిన దొంగ లేడు’ అంటూ విర్రవీగిన వాళ్లకు బొమ్మలు చూపించారు సోహైల్‌ – మెహబూబ్‌. ‘కిల్లర్ కాయిన్‌ టాస్క్‌’లో అత్యధిక కాయిన్స్‌ సంపాదించారు. దీని కోసం ఆ ఇద్దరూ రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారు. ఇంకా బుధవారం ఏం జరిగిందంటే?

‘కిల్లర్‌ కాయిన్స్‌’ టాస్క్‌లో భాగంగా మంగళవారం ఎపిసోడ్‌లో అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ అక్కడ ఇక్కడ కాయిన్స్‌ కొట్టేసిన విషయం మనకు తెలిసిందే. టాస్క్‌ మొదలవ్వగానే చిన్న చిన్న కాయిన్స్‌ కోసం చూసిన మెహబూబ్‌ – సోహైల్‌ రాత్రయ్యేసరికి ఆట మార్చేశారు. అందరూ కునుకేస్తుంటే వీళ్లు కన్నాలేశారు. వీళ్లు వాళ్లు అని లేకుండా దొరికినవాళ్ల కాయిన్స్‌ ఎత్తేశారు. ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్‌ – మెహబూబ్‌ – సోహైల్‌ మధ్య చిన్న డిస్కషన్‌ కూడా జరిగింది.

ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్‌గా ఉన్న అభిజీత్‌ – హారిక మధ్య ఈ టాస్క్‌ డిఫరెన్స్‌ తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోంది. అభిజీత్‌ కష్టపడి పట్టుకున్న కాయిన్స్‌ను స్వాతి దీక్షిత్‌కు ఇవ్వడం హారికకు నచ్చలేదు. ఆ విషయాన్నే అభిజీత్‌కు చెప్పింది.

Friendship goals Harika and Abijeet at Bigg Boss Telugu 4 Show1

Click Here -> హారిక – అభిజీత్ స్నేహం ముచ్చట్లు

రాత్రి రెండు గంటలప్పుడు కూడా బిగ్‌బాస్‌ కొన్ని కాయిన్స్‌ విసిరాడు. వాటిని అందరూ పట్టుకుంటుంటే… అమ్మ రాజశేఖర్‌, అఖిల్‌ మాత్రం కొట్టేసే పనిలో ఉన్నారు. ఈలోగా ‘స్విచ్‌’ అనే స్పెషల్‌ కాయిన్‌ పడింది. తొలుత ఆ కాయిన్‌ను మెహూబూబ్‌ చూసినా… ఏదో అవసరం లేని కాయిన్‌ అనుకొని వదిలేశాడు. దానికి సుజాత తెలివిగా పట్టేసింది. ఆ తర్వాత ఆ కాయిన్‌ చాలా ఇంపార్టెంట్‌ అని బిగ్‌బాస్‌ అనౌన్స్‌ చేశాడు. ఈ కాయిన్‌ ఎవరి దగ్గర ఉంటే వారికి ఈ టాస్క్‌ చివరిలో ప్రత్యేక ప్రయోజనం లభిస్తుందని కూడా చెప్పాడు. పాపం మెహబూబ్‌. సోహైల్‌ అయితే మెహబూబ్‌ను తెగ తిట్టేశాడు.

మంగళవారం ఉదయమంతా అందరి కాయిన్స్‌ను ఎత్తేసిన మాస్టర్‌ కాయిన్స్‌ను సోహైల్‌ – లాస్య – ఆరియానా కలసి దొంగతనం చేశారు. కుమార్‌ సాయి దుప్పటి కట్‌ చేసి సోహైల్‌ దొంగతనం చేయాలని చూసినా ఫెయిల్‌ అయ్యాడు. ఉదయం మాస్టర్‌ లేచి చూసేసరికి కాయిన్స్‌ లేకపోవడంతో మెహబూబ్‌ – సోహైల్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు మాస్టర్‌. ఇది గేమ్‌.. గేమ్‌ ఆడుతున్నాం అంటూ సోహైల్‌ చెప్పినా మాస్టర్‌ వినలేదు.

ఈలోగా బిగ్‌బాస్‌ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇంట్లో ప్రకటనల మీద బట్టలు ఆరబెట్టొద్దు అని చెప్పాడు. దీంతో అందరూ సోహైల్‌ – మెహబూబ్‌ మీద పడ్డారు. జిమ్‌ ఏరియాలో కాయిన్స్‌ పెట్టి పైన దుప్పటి కప్పడం వల్ల బిగ్‌బాస్‌ అలా చెప్పాడని అన్నారు. అయినా వాళ్లిద్దరూ వినలేదు. బిగ్‌బాస్‌ దీని గురించి అనలేదు అంటూ గట్టిగా నిలబడ్డారు. ఈలోగా మెహబూబ్‌ ‘ఫిజికల్‌ టాస్క్‌’ గా మార్చొద్దు అని అన్నాడు. దీంతో అభిజీత్‌ రియాక్ట్‌ అయ్యాడు. ఏంటి భయపెడుతున్నావా అంటూ గద్దించాడు. కాసేపటికి అందరూ కూల్‌ చేసేశారు.

ఫిజికల్‌ అనే పదం మీద ఆ తర్వాత కూడా చర్చ జరిగింది. అమ్మ – దివి – అభిజీత్‌ కలసి ఫిజికల్‌ అనే పదం మీద చర్చ పెట్టారు. రౌడీ, దొంగ అంటూ సోహైల్‌ను అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ అన్నాడు. ఇది రౌడీయిజంలా ఉంది అని అభిజీత్‌ అభిప్రాయపడ్డాడు. మరి దీనికి బిగ్‌బాస్‌ ఏమంటారో చూడాలి.

టాస్క్‌లో మొదటి రౌండ్‌ ముగిశాక అందరూ వివరాలు చెప్పారు. అవినాష్‌ 3160, అమ్మ రాజశేఖర్‌ 320, స్వాతి 1930, లాస్య 1560, అభిజీత్‌ 1770, నోయల్‌ 900, హారిక 1450, సోహైల్‌ 3620, మెహబూబ్‌ 4360, మోనాల్‌ 610, అఖిల్‌ 2370, ఆరియానా 1850, దివి 110, కుమార్‌సాయి 1570, గంగవ్వ 0, సుజాత 340+స్విచ్‌ కాయిన్స్‌ సాధించారు.

ఆ తర్వాత బిగ్‌బాస్‌ ‘కిల్లర్‌ కాయిన్స్‌’లో రెండో స్టేజీ మొదలుపెట్టారు. అందులో ఇంటి సభ్యులకు ఓ కాయిన్‌ ఇచ్చారు. దానిని విసరుతూ మిగిలిన ఇటి సభ్యులకు అతికించాలి. బజర్‌ మోగినపపుడు ఎవరికి కాయిన్‌ అతికి ఉంటుందో వారి కాయిన్స్‌ కౌంట్‌ నుంచి 50 శాతం తగ్గిపోతాయి. ఇలా ఎనిమిది రౌండ్లు ఉంటాయని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఈ రౌండ్‌ మొదలైన కాసేపటికి దివి.. సోహైల్‌ను టార్గెట్‌ చేసింది. దీంతో సోహైల్‌కు కోపం వచ్చి అరిచాడు. దానికి మాస్టర్‌ రియాక్ట్‌ అయ్యి… కాస్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మోనాల్‌ తొలుత ఔటయ్యింది. ఈలోగా అవినాష్‌ కాలు జారిపడటంతో గేమ్‌ను కాసేపు ఆపేశారు.

గేమ్‌లో ఓడిపోయిన మోనాల్‌ వాష్‌ రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసింది. ‘అమ్మా.. ’ అంటూ ఏడుస్తూనే ఉంది. తనకు ఎవరూ సపోర్టు చేయలేదంటూ బాధపడింది.

Monal Gajjar gets emotional at Bigg Boss Telugu 4 Show1

Click Here -> ‘అమ్మా’ అంటూ బోరున ఏడ్చిన మోనాల్‌

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

related news

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

trending news

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

4 hours ago
Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

4 hours ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

8 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

9 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

10 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

9 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

9 hours ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

10 hours ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

10 hours ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version