బిగ్‌బాస్‌ 4: ఈసారి కూడా అందరూ అనుకున్న వ్యక్తే…!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో రెండో ఎలిమినేషన్‌ జరిగిపోయింది. తొలి వారం లాగే రెండో వారంలో కూడా అందరూ అనుకున్న వ్యక్తే ఎలిమినేట్‌ అయిపోయారు. సూర్యకిరణ్‌కు రెప్లికా కాకపోయినా, ఆయనలా ప్రతి విషయానికి సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యే కళ్యాణిని బయటకు పంపించేశారు. రెండో వీకెండ్‌ తొలి రోజు చాలా సాదాసీదాగా కరాటే కళ్యాణిని ఎలిమినేట్‌ చేసేశాడు నాగ్‌. దాంతోపాటు మరో ఎలిమినేషన్‌ కూడా ఉందని ప్రకటించాడు కూడా.

Bigg Boss 4 telugu 2nd week 1st elimination1

ఇంట్లోకి వచ్చిన తొలి రోజు నుంచి కళ్యాణి అందరితో కలివిడిగా ఉంటున్నా… ఎక్కడో చిన్న దూరం కనిపించేది. కారణం ఆమె భోళాతనం. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసే తత్వం కళ్యాణిది. అదే ఆమె అందరికీ దూరం అవ్వడానికి కారణమైంది. కొన్నిసార్లు అనవసరంగా కోపాలు తెచ్చుకోవడం, అరవడం, ఏడవడం లాంటివి ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. అందుకే ఓట్లు వేయలేదు. దీంతో ఈ వారం ఎలిమినేట్‌ చేసి బయటకు పంపించేశారు. మరి ఈ రోజు స్టేజీ మీద వచ్చిన కళ్యాణి ఏం చెబుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus