బిగ్‌బాస్‌ 4 రెండో వారం హైలైట్స్‌: రౌడీబేబీ వావ్ షో… నాగ్‌ సీరియస్‌… మాస్టర్‌ ఎమెషన్‌…!

  • September 21, 2020 / 12:39 PM IST

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో రెండో వారం ముగిసింది. పడవ నామినేషన్‌తో చిరాకుగా మొదలైన వారం… ఫేక్‌ ఎలిమినేషన్‌తో క్లోజ్‌ అయ్యింది. ఈ వారం కుమార్‌ సాయి, అవినాష్‌ వైల్డ్‌ కార్డుగా ఇంట్లోకి రాగా, కళ్యాణి ఎలిమినేట్‌ అయ్యి వెళ్లిపోయింది. ఇంకా గత వారం ఏం జరిగాయంటే?

* ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయిన సూర్యకిరణ్‌ను అమ్మ రాజశేఖర్‌ గుర్తు చేసుకున్నాడు. రోజూ ఇద్దరూ కూర్చొని సిగరేట్‌ తాగే చోటుకు వెళ్లి తనలో తాను మాట్లాడుకున్నాడు. సూర్యకిరణ్‌ను కూర్చున్న ప్లేస్‌ దగ్గర సూర్య… మై ఫ్రెండ్‌ అని వేలితో రాశాడు.

* రెండో వారం నామినేషన్‌ ప్రక్రియ కోసం బిగ్‌బాస్‌ పడవ టాస్క్‌ పెట్టాడు. పడవలో అందరినీ ఎక్కించి, ఒక్కో తీరం దగ్గర ఒకరిని దిగమన్నాడు. అలా దిగినవాడు నామినేట్‌ అయినట్లు అని చెప్పాడు. అలా తొమ్మిది తీరాల్లో తొమ్మిదిసార్లు పడవ ఆగుతుందని, ఆగి హారన్‌ కొట్టినప్పుడు పడవ దిగాలని సూచించాడు. అయితే టాస్క్‌ మధ్యలో దిగిపోయినవాళ్లు కూడా నామినేట్‌ అవుతారని బిగ్‌ బాస్‌ చెప్పాడు. అలా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి గంగవ్వ, నోయల్‌, మోనాల్‌, సోహైల్‌, కళ్యాణి, రాజశేఖర్‌, కుమార్‌, హారిక, అభిజీత్‌ నామినేట్‌ అయ్యారు.

Click Here-> నామినేషన్‌ సాగిన విధానం ఇదీ…

* భోజనం తర్వాత ఇంట్లో వాళ్లంతా బెడ్‌రూమ్‌లో కలసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటే నోయల్‌ ‘కన్నుల్లో నీ రూపమే..’ అంటూ పాట అందుకున్నాడు. దానికి కళ్యాణి, అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ కూల్‌ స్టెప్పులేశారు. కళ్యాణి హీరోయిన్‌ రేంజిలో వయ్యారంగా కూర్చుంది. రాజశేఖర్‌ అంతే ప్రేమగా వచ్చి చేతిలో బకెట్‌ పక్కనపెట్టి కళ్యాణి వేలు అందుకోబోయారు. ఈలోగా కళ్యాణిని చూసి షేక్‌ అయ్యి… కింద పడిపోయారు. ఆ నవ్వుల సీన్‌ని వివరించలేం కానీ… చూడటమే మంచింది.

* మార్నింగ్‌ మస్తీలో భాగంగా అందరినీ అలరించాలని హారికకు టాస్క్‌ ఇచ్చారు . కళ్యాణి పాట పాడితే హారిక డ్యాన్స్‌ వేసి అలరించింది. ఇప్పటికింకా నా వయసు ఇంకా పదహారే అనే పాట పాడగా… దానికి తగ్గట్టుగా హారిక హాట్‌ హాట్‌ స్టెప్పులేసింది. అందరూ చప్పట్ల మోతతో అభినందించారు. హారిక గురించి నోయల్‌ ఓ ర్యాప్‌ పాడి స్టెప్పలేయించాడు. అఖిల్‌, హారిక కోసం ‘అదిరేటి డ్రెస్సు మీరేస్తే..’ అంటూ హౌస్‌ మేట్స్‌ పాట పాడారు. దానికి ఇద్దరూ వావ్‌ మూమెంట్స్‌ వేశారు. మస్తీలో నోయల్‌తో కలసి హారిక టాస్క్‌ వేసింది.

Click Here-> బిగ్‌బాస్‌ రౌడీబేబీ అదుర్స్‌…

* ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌గా ‘బీబీ టీవీ’ ని ఇచ్చాడు. ఎంతగా ఎంటర్‌టైన్మెంట్‌ ఇస్తే అంత మంచిది అని కూడా సూచించాడు. దాని కోసం ‘అత్త అల్లుడు అమెరికా మోజు’ అనే సీరియల్‌ పేరు కూడా ఇచ్చాడు.

Click Here-> ఆ సీరియల్‌ ఎలా సాగింది… ఎవరు గెలిచారంటే?

* తర్వాతి ‘బీబీ టాలెంట్‌ షో’ను ఏర్పాటు చేశాడు బిగ్‌బాస్‌. ఆరియానా యాంకర్‌గా… నోయల్‌, లాస్యను జడ్జీలుగా డ్యాన్స్‌ షోను ఏర్పాటు చేశాడు. హారిక – మెహబూబ్‌, మోనాల్‌ – సోహైల్‌, అమ్మ రాజశేఖర్‌ (సోలో) పర్‌ఫార్మెన్స్‌ చేయాలి. ఆఖరిగా అమ్మాయిల నుండి ఒకరిని, అబ్బాయిల నుండి ఒకరిని ఎంపిక చేసి స్టార్‌ పర్‌ఫార్మర్‌గా ఎంపిక చేస్తారు.

Click Here->డ్యాన్స్‌ స్పెషల్‌: టాపు లేపేసిన హారిక – మెహబూబ్‌

* ‘బీబీ కామెడీ షో’లో అవినాష్‌, కుమార్‌ను లీడర్లుగా బిగ్‌బాస్‌ రెండు టీమ్‌లు ఏర్పాటు చేశాడు. కళ్యాణి, అఖిల్‌, సుజాత, మోనాల్‌.. అవినాష్‌ టీమ్‌ సభ్యులుగా ఉంటారు. కుమార్‌ టీమ్‌లో అమ్మ రాజశేఖర్‌, దేవి, దివి, హారికను ఇచ్చాడు. ఈ రెండు టీమ్‌లు కామెడీతో ఎంటర్‌టైన్‌ చేసేలా స్కిట్లు చేయాలి. ఎవరి స్కిట్‌ నచ్చితే వారికి బెస్క్‌ స్కిట్‌ ఇవ్వమని మిగిలిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ సూచించాడు. ఇంట్లోవాళ్లు అవినాష్‌ టీమ్‌కి ఇవ్వగా… బిగ్‌బాస్‌ ఇద్దరినీ గెలిపించాడు.

* రెండో వారం మొదలైనప్పటి నుంచి గంగవ్వ ఇంట్లో ఉంటానికి ఇబ్బంది పడుతోంది. ఈ రోజు చాలా ఇబ్బంది పడిపోయింది. ఒంట్లో బాగా నలతగా ఉండటంతో నీరసంగా అయిపోయి బెడ్‌ మీద వాలిపోయింది. పరిస్థితి గమనించిన బిగ్‌బాస్‌ గంగవ్వను కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిపించి మాట్లాడాడు. ‘‘నేను ఇంట్లో చాలా రోజులు ఉందామనే అనుకున్నా. శరీరం సహకరించడం లేదు. ఇబ్బందిగా ఉంటోంది. సరైన విశ్రాంతి కూడా లేకపోవడంతో ఇంకా ఇబ్బంది అనిపిస్తోంది’’ అని చెప్పింది. ‘మీరు గట్టి మనిషి… ఎన్నో కష్టాలు దాటి ఇక్కడికి వచ్చారు’ అంటూ బిగ్‌బాస్‌ ధైర్యం చెప్పి గంగవ్వను వైద్యుల పర్యవేక్షణకు పంపించారు. ఆ తర్వాత గంగవ్వ మళ్లీ యాక్టివ్‌ అయిపోయింది.

* బిగ్‌బాస్‌ ఇంటి నియమాలు పాటించడం లేదంటూ ఇంటి సభ్యులకు శిక్ష వేశాడు. మోనాల్‌, అభిజీత్‌, అఖిల్‌, నోయల్‌, హారిక… తెలుగులో కాకుండా ఇతర భాషల్లో మాట్లాడుతున్నారు. తక్షణమే రండి అంటూ బిగ్‌బాస్‌ పిలిచినా కూడా కొంతమంది రావడం లేదు. వారిలో అమ్మ రాజశేఖర్‌, దేవి, మోనాల్‌, నోయల్‌, కళ్యాణి, దివి ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది మైక్స్‌ను సరిగా ధరించడం లేదు. దీంతో క్రమశిక్షణ నేర్పించాల్సిన అవసరం ఉందని బిగ్‌బాస్‌ భావించాడు.

* బిగ్‌బాస్‌ ఇంటి కొత్త కెప్టెన్‌ ఎంపిక కూడా ఈ రోజే చేశారు. లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన నలుగురి పేర్లను బిగ్‌బాస్‌కు చెప్పమని అడిగాడు. వారి నుంచి ఒకరిని కెప్టెన్‌ చేయాలని అనుకున్నారు. ఇంట్లో వాళ్లందరూ కలసి అభిజీత్‌, కళ్యాణి, నోయల్‌, మోహబూబ్‌ను కొత్త కెప్టెన్‌ రేసులో ఉంచారు. ఆఖరికి నోయల్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నారు.

* పడవ నామినేషన్స్‌ ఫ్లాప్‌ అవ్వడం బిగ్‌బాస్‌కు , నాగార్జునకు నచ్చలేదు. ఆ మాటొస్తే జనాలకు కూడా నచ్చలేదు. ఆటలో సీరియస్‌నెస్‌ లేకుండా ఆడినందుకు నాగార్జున నామినేట్‌ అయిన అందరికీ క్లాస్‌ తీసుకున్నాడు. ‘సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారా… లేక జనాల దగ్గర సింపతీ కొట్టేయాలని చూస్తున్నారా’ అంటూ ఏకేశాడు నాగ్‌.

* ఇంట్లో సీరియస్‌ నెస్‌ తీసుకురావడానికి, డ్రామా పెరగడానికి నాగ్‌ ‘హీరో /జీరో’ టాస్క్‌ పెట్టాడు. ఇంట్లో ఉన్నవాళ్లలో హీరో అనుకున్నవాళ్లను కుర్చీలో కూర్చోబెట్టాలి. జీరో అనుకున్నవాళ్లను ‘జీరో’ డోర్‌ నుంచి బయటకు నెట్టేయాలి అని షరతు పెట్టాడు. అలా జీరో నుంచి బయటకు పంపించిన వాళ్లకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని అర్థం అని కూడా చెప్పాడు.

Click Here->మెడపెట్టి గెంతేసిన దేవీ… ఏడ్చిన అమ్మ రాజశేఖర్‌

* కరాటే కళ్యాణి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. కళ్యాణికి నాగార్జున ఓ టాస్క్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో టాప్‌ 5 అనిపించే ఐదుగురు, బోటమ్‌ 5 అనే ఐదుగురు పేర్లు, వివరాలను చెప్పమని అడిగాడు. ఈ క్రమంలో కళ్యాణి కొందరి విషయంలో మంచిగా చెప్పగా, ఇంకొందరి విషయాల్లో షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. హారికకు ఫస్ట్‌ ప్లేస్‌ ఇవ్వగా… దేవీతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది.

Click Here-> కళ్యాణి మిగిలిన వారి గురించి ఏం చెప్పిందంటే?

* వచ్చే వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఎవరిని మీరు నామినేట్‌ చేస్తారు అంటూ కళ్యాణికి బిగ్‌ బాంబ్‌ ఇచ్చాడు నాగ్‌. తొలుత షాక్‌ అయినా తర్వాత దేవీ నాగవల్లిని నామినేట్‌ చేసింది.

* ఎలిమినేషన్‌ జోన్‌లో మిగిలి ఉన్న మోనాల్‌, హారికను ఒకరిని రక్షించే అవకాశం నాగార్జున నామినేట్‌ కాని హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. అఖిల్, మెహబూబ్‌, లాస్య, అరియానా, సుజాత, దివి, దేవీ కలసి ఆ ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉండాలో నిర్ణయిస్తాడని నాగ్‌ చెప్పాడు. ఇద్దరికీ చెరో బీకర్‌ ఇచ్చి అందులో నీళ్లు పోయాలని ఆ ఏడుగురికి చెప్పాడు. నలుగురు హారికకు ఓటేయడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఆఖరున డోర్‌ దగ్గర నాగార్జున ఆమెను ఆపేశాడు.

Click Here-> ఈ ప్రాసెస్‌ ఎలా జరిగిందంటే?

‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus