బిగ్‌బాస్ డ్యాన్స్‌ స్పెషల్‌: బీబీ టాలెంట్ షోలో ‘రౌడీ బేబీ’ టీం క్లీన్ స్వీప్!

పదో రోజు ఎంటర్‌టైన్మెంట్‌ కోసం బిగ్‌బాస్‌ ‘బీబీ టాలెంట్‌ షో’ను ఏర్పాటు చేశాడు. ఆరియానా యాంకర్‌గా… నోయల్‌, లాస్యను జడ్జీలుగా డ్యాన్స్‌ షోను ఏర్పాటు చేశాడు. అయితే షో మొదలయ్యే ముందు నోయల్‌ – లాస్య ఓ పర్‌ఫార్మెన్స్‌ చేయాలి. దానికి నోయల్‌ ర్యాప్‌ రూపొందించాలని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఈ టాలెంట్‌ షోలో గంగవ్వ పాట పాడాలి. దీని కోసం టీమ్స్‌ కూడా బిగ్‌బాసే చెప్పాడు. హారిక – మెహబూబ్‌, మోనాల్‌ – సోహైల్‌, అమ్మ రాజశేఖర్‌ (సోలో) పర్‌ఫార్మెన్స్‌ చేయాలి. ఆఖరిగా అమ్మాయిల నుంచి ఒకరిని, అబ్బాయిల నుంచి ఒకరిని ఎంపిక చేసి స్టార్‌ పర్‌ఫార్మర్‌గా ఎంపిక చేస్తారు. మిగిలిన సభ్యులు మధ్యలో యాడ్స్‌ చేయాలి.

బీబీ టాలెంట్‌ షోలో తొలి పార్టిసిపెంట్‌గా అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ వచ్చారు. తనదైన శైలిలో మాస్‌ స్టెప్పులతో అదరగొట్టాడు. మధ్యలో దివి, కళ్యాణి స్పెషల్‌ అపీరియన్స్‌ కూడా ఇచ్చారు. మొత్తంగా మాస్టర్‌ తన కొరియోగ్రాఫర్‌ పనితనం ఇక్కడ చూపించారు. పర్‌ఫార్మెన్స్‌ తర్వాత అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ యాక్టింగ్‌తో కూడా చింపేశాడు. జడ్జీలకు పాయింట్లు ఉండటంతో లాస్య, నోయల్‌ కూడా తన టాలెంట్‌ను చూపించారు. ‘వానా వానా వెల్లువాయే..’ పాటకు సోహైల్‌, మోనాల్‌ హాట్‌ మూమెంట్స్‌తో పిచ్చెక్కించారు. మోనాల్‌ డ్యాన్స్‌ను అభిజీత్‌ నవ్వుతూ ఎంజాయ్‌ చేయగా,… అఖిల్‌ మాత్రం ఏదో ఆందోళనతో చూసినట్లుగా కనిపించాడు.

రెండు పాటలు చూసిన తర్వాత ఎలాగైనా బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ కొట్టాయాలని హారిక – మెహబూబ్‌ తమ టాలెంట్‌ మొత్తం చూపించారు. సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘టాపు లేచిపోద్దే…’కి సూపర్‌ స్టెప్పులు వేశారు. హారిక చూపించిన ఈజ్‌, హాట్‌నెస్‌ అన్‌మ్యాచబుల్‌ అసలు. మెహబూబ్‌ జిమ్నాస్టిక్‌ మూమెంట్స్‌కు హారిక క్యూట్‌నెస్‌ భలే జోడీ అయ్యింది. ఫుల్‌ సాంగ్‌కి మూమెంట్స్‌ వేయడం.. అందులోనూ సింగిల్‌ షాట్‌లో అంటే మాటలు కాదు. అందుకే మెహబూబ్‌ బెస్ట్‌ పర్‌ఫార్మర్‌గా నిలిచాడు. హారికకు బెస్ట్‌ పర్‌ఫార్మర్‌గా నిలిచింది. అంత బాగా డ్యాన్స్‌ చేస్తే రాకుండా ఉంటుంది మరి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus