ఫిజికల్ టాస్క్ వస్తే కానీ… బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరేంటో తెలియదు అని అందరూ అనుకుంటున్న సమయంలో బిగ్‌బాస్ అదే పని చేశాడు. ఉక్కు హృదయం పేరుతో ఓ టాస్క్ ఇచ్చాడు. పైగా అదే కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించేది అని కూడా చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్ అంతా అదే పనిలో పడ్డారు. మనకూ 16వ రోజు అదే చూపించారు. అయితే చూపించాల్సింది చాలా ఉంది. ఇంకా ఏం చూపించారంటే?
* మర్నింగ్ మస్తీలో భాగంగా అందరికీ తెలుగు రైమ్స్ నేర్పించమని మోనాల్‌కు బిగ్‌బాస్ చెప్పాడు. ‘బావా బావా పన్నీరు..’ అంటూ రైటమ్ నేర్పించడం మొదలుపట్టింది మోనాల్. ఈ క్రమంలో మోనాల్ కష్టాలు, హౌస్‌మేట్స్ నవ్వులు ఉదయం కాస్త ఫన్ తీసుకొచ్చాయి.
* నామినేషన్ సమయంలో మంటలో ఫొటోలు పడేయడం ప్రేక్షకులకు చాలా మందికి నచ్చలేదు. గంగవ్వ కూడా అదే మాట అంది. ‘కన్ను మూసుకుంటే ఫొటోలు కాల్చేయడమే గుర్తొస్తోంది’ అని చెప్పింది.
* ఉక్కు హృదయం పేరుతో బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. దాని ప్రకారం రోబోలు, మనుషులుగా రెండు టీమ్‌లు విభజించాడు. రోబోల టీమ్‌లో అందరూ చనిపోతే మనుషులు విజేతలు అవుతారు. అలా కాకుండా ఒక్క రోబో మిగిలి ఉన్నా రోబోలు విజేతలు అవుతారు. ఇందులో గెలిచిన టీమ్ మాత్రమే కెప్టెన్సీ పోటీదారులు అవుతారు.
* రేషన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న అభిజీత్.. తన పనిని తాను బాగా చేశాడు. ఫుడ్ వేస్టేజీ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. పెరుగు పడేయడం, టాస్క్ ముందు ఫుడ్ ఎత్తుకుపోవడం లాంటి అంశాలలో చక్కగా వ్యవహరించాడు.
* మనుషులు గార్డెన్ ఏరియాలో ఉంటారు. ఇంట్లో ఉన్న గ్యాస్, వాటర్‌తోపాటు ఇంట్లో ఎక్కడికి వెళ్లాలన్నా రోబోల నియంత్రణలో ఉంటుంది. రోబోట్స్‌కి సమయానుసారం ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఆ అవకాశం కేవలం మనుషులకు మాత్రమే ఉంది. రోబోలను ఛార్జ్ చేసినప్పడు మనుషులు గ్యాస్, వాటర్ యాక్సెస్ పొందొచ్చు. ఈ రోజు అలా మనుషుల టీమ్ ఓ బాల్ పగలకొట్టి దేవీ అనే రోబోను చంపేశారు. టాస్క్ ఇంకా ముగించలేదు. ప్రోమో బట్టి చూస్తే…