* మామూలుగా బిగ్‌బాస్ ఎసిపోడ్ పాటలతో మొదలవుతుంది. ఇంటి సభ్యులందరినీ హుషారుపరిచేలా ఓ పాటేస్తే… వాళ్లు డ్యాన్సులు వీక్షకుల్ని అలరిస్తారు. కానీ ఈ రోజు బిగ్‌బాస్ ఇంట్లో అలాంటి పాట ఏమీ వేసినట్లు లేదు. లేక వేసి మనకు చూపించలేదో తెలియలేదు.
* మార్నింగ్ మస్తీ అంటే తమ గురించి చెప్పడం, టాస్క్‌లు చేయడం అనుకుంటున్న సమయంలో బిగ్‌బాస్ నాలుగో రోజు షాక్ ఇచ్చాడు. తనదైన శైలిలో ఇంటి సభ్యుల మధ్య గొడవ పెట్టడానికి పావులు కదిపాడు. గత మూడు రోజులుగా ‘ఫర్నిచర్‌లో కలిసిపోయింది’ అని కామెంట్స్ వస్తున్న దివితో ఓపెన్ హార్ట్ విత్ పార్టిసిపెంట్ నిర్వహించాడు. హౌస్ మేట్స్‌లో ఏ మార్పు వస్తే బాగుంటుందని ఆమెతో అందరి ముందు చెప్పించారు.
* అఖిల్ తన మోడల్/యాక్టర్ యాటిట్యూడ్ వాక్‌ను మార్చుకుంటే బాగుంటుందని దివి సజెస్ట్ చేసింది. హౌస్‌లో ఎవరైనా ఏడిస్తే… గంగవ్వ కూడా ఏడుస్తోంది. అలా ఏడవొద్దని సూచించింది. దానికి గంగవ్వ తనదైన శైలిలో ‘నా పక్కన ఎవరైనా ఏడిస్తే నాకు ఏడుపు రాదా… ఏడవొద్దంటున్నావ్’ పంచ్ వేసింది. అభిలో కొంచెం కోపం కనిపిస్తోంది… దానిని తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పింది. ‘నువ్వు చాలా సెన్సిటివ్’ అంటూ లాస్యను దివి అనగా… లాస్య దానిని ఖండించింది. ‘అది నీ అభిప్రాయం మాత్రమే’ అని తెగేసి చెప్పింది. ఎవరినైనా సంబోధించినప్పుడు ఎలా మాట్లాడాలో హారికకు సూచించింది. ఆమె చాలా కూల్‌గా ఓకే అని చెప్పేసింది. మోనాల్ హైపర్ యాక్టివ్… అన్నింటా పార్టిసిపేట్ చేస్తుంది. అయితే చిన్న విషయానికే ఏడ్చేస్తోంది. ఫ్యూచర్ సీరియస్ విషయం వస్తే ఏడ్చినా పట్టించుకోరు అని దివి సూచించింది.
* ఇక దేవి నాగవల్లి విషయానికొచ్చేసరికి… హైలో ఉంటూ ఒక్కసారిగా లో అయిపోతారు. అలా కాకుండా మోడరేట్‌గా ఉంటే బాగుంటుందని సజెస్ట్ చేసింది. నోయల్ షో స్టైల్‌ను పూర్తిగా మైండ్‌లో పెట్టుకుని హౌస్ మేట్స్‌ను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నట్లుగా అనిపిస్తోందని దివి చెప్పింది. ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఓవర్ రియాక్ట్ అవుతున్నారని కళ్యాణి గురించి సజెస్ట్ చేసింది. ‘మీరు అందరినీ చదివేశారు…’ అని సూర్యకిరణ్‌ను పొగిడేసింది దివి. ‘నా మాటే విను’ అని అనొద్దు మాత్రం సూచించింది. హౌస్ మొత్తంలో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పర్సన్ అమ్మ రాజశేఖర్ అని దివి అనగానే… అందరూ చప్పట్లు కొట్టారు. అయితే కొన్ని కుల్లు జోకులు మాత్రం వేయొద్దు అని చెప్పింది. ఆరియానా, సోహైల్ గురించి పెద్దగా తెలుసుకోలేకపోయాను కాబట్టి చెప్పను అంది. అయితే సుజాత, మెహబూబ్ గురించి చెప్పలేదు. లేక చెప్పాక చూపించలేదో.
* దివి గురించి బయట జనాలు అనుకుంటున్న ‘ఇంట్లో అందరరితో కలసి ఉండటం లేదు.. ఏదో వేరేగా ఉంటోంది’ అనే మాటను ఇంట్లో కూడా అనుకున్నారట. నేను, అమ్మ రాజశేఖర్ అలా అనుకున్నామని సూర్యకిరణ్ చెప్పారు.
* కట్టప్ప ఎవరు అనే టాపిక్ ఈ రోజు కూడా వచ్చింది. ఇంట్లో వాళ్లందరి గురించి దివి చెప్పడంతో ఆమెనే కట్టప్పనా అని అనుకున్నారు. అయితే మళ్లీ కాకపోవచ్చని అనుకున్నారు. లాస్య, హారిక, సూర్యకిరణ్ మధ్య ఈ సంభాషణ జరిగింది. మధ్యలో వచ్చిన గంగవ్వ ‘ఆరియానా, సోహైలేనా కట్టప్ప’ అని మరో డౌట్ తెచ్చింది. అయితే వాళ్లిద్దరూ కారు అని క్లారిటీ ఇచ్చారు సూర్యకిరణ్. గంగవ్వ చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటోందని సూర్యకిరణ్ తెగమెచ్చుకున్నాడు. ఆఖరికి అఖిలేమో అని అనుకున్నారు.
* లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో హౌస్ మేట్లు 9 వేల పాయింట్లు కోల్పోవడానికి కట్టప్పే కారణమని కన్ఫెషన్ రూమ్‌లో ఆరియానా, సోహైల్‌కు బిగ్‌బాస్ చెప్పాడు. ఇంట్లో వాళ్లను ఒక్కొక్కరిగా పిలిచి ఇంట్లో ‘కట్టప్ప ఎవరు’ అనే విషయంలో వివరాలు తెలుసుకోమని టాస్క్ ఇచ్చాడు.
* కొత్త టాస్క్ విషయంలో తొలుత 14 మంది టీమ్ అంగీకరించలేదు. ఇదేదో సీక్రెట్ టాస్కేమో… మనం ఎందుకు వాళ్లకు చెప్పాలి అని అందరూ అనుకున్నారు. నోయల్ ఈ టైమ్‌లో లీడ్ చేశాడు. ఎవరూ ఆరియానా- సోహైల్‌తో మాట్లాడకుంటా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు. అయితే సూర్యకిరణ్ మాత్రం అఖిల్‌ని కట్టప్ప అని ఎందుకు అనుకుంటున్నానో చెప్పారు. కట్టప్ప టాస్క్ సమయంలో అఖిల్ ఓవర్ రియాక్ట్ అవ్వడం వల్ల అలా అనుకుంటున్నట్లు వివరించాడు.
* గంగవ్వను ఈ విషయం అడిగితే… అఖిల్ పేరే చెప్పింది. అయితే అఖిల్ కట్టప్పలా ఇంటి మొత్తాన్ని కాపాడుకుంటున్నాడనే ఆలోచనలో ఆ పేరు నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 14 మందిలో మచ్చలాంటివాడిని కట్టప్ప అనుకుంటున్నాను… అది నోయల్ అనుకోవచ్చు అని అమ్మ రాజశేఖర్ తెలిపారు.
* కట్టప్ప ఎవరు అంటూ ఆరియానా – సోహైల్ అడుగున్న టాస్క్ విషయంలో దివి ఎక్కువ క్లారిటీతో ఉందనిపించింది. కార్డ్ మీద రాసిన విషయాన్ని వాళ్ల దగ్గర చెబితే పోయేదేముంది… ‘మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు అనిపిస్తోంది’ అంటూ హౌస్ మేట్స్ ముందు కుండబద్దలుకొట్టింది.
* ‘మా 14 మందిలో కట్టప్ప లేరు’ అని దేవి నాగవల్లి టాస్క్‌ను కొత్తదారి పట్టించింది. లాస్యను కట్టప్పగా దివి తేల్చేసింది. మెహబూబ్ కూడా అదే మాట చెప్పాడు. మోనాల్, నోయల్, హారిక, అభిజిత్, అఖిల్, సుజాత, కళ్యాణి అయితే ఈ టాస్క్‌లో ‘కట్టప్ప ఎవరు’ అని చెప్పలేదు.
* ఆ తర్వాత గంగవ్వ మజా షురూ అయ్యింది. హౌస్ మేట్స్ గురించి తన అభిప్రాయాన్ని గంగవ్వ చెప్పడం ప్రారంభించింది. ‘అప్పుడు పని చేస్తావ్, నవ్వుతావ్, ఏడుస్తావ్’ అంటూ కళ్యాణకి పంచ్ వేసింది గంగవ్వ. సుజాత కూడా కళ్యాణిలానే చేస్తోందట. అమ్మ రాజశేఖర్ అయితే ఆడతాడు, నవ్వుతాడు, నవ్విస్తాడు, సరదాగా ఉంటాడని గంగవ్వ చెప్పింది. మెహబూబ్ అయితే యాపిల్ తినుకుంటా మంచిగా ఉంటాడని చెప్పింది. నోయల్ అయితే కాళ్లు నొప్పి అంటాడు.. వెంటనే మందులేసుకొని మళ్లీ హుషారు అయితడు అని అంది గంగవ్వ. అభిజిత్ అయితే మంచిగా పాత్రలు తోముతాడు, కడుగుతాడు అని మెచ్చేసుకుంది గంగవ్వ. సూర్యకిరణ్ ఇంట్లో వాళ్లందరికీ పెద్ద భూస్వామి అని బిరుదు ఇచ్చింది గంగవ్వ. దేవిని ‘దేవక్క’ అంటూ సెటైర్ వేసి… ‘చేతగాకపోయినా అందరినీ కలుపుకుంటూ పోతుంది’ అని చెప్పింది. ఇంట్లో ఉన్న కొడుకును గుర్తు చేసుకుంటూ బొమ్మను ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తుంటది లాస్య అని చెప్పింది గంగవ్వ. ఆయిల్ పడకపోయినా మోనాల్ వంట చేసిందని మెచ్చుకున్న గంగవ్వ… దివి గురించి కూడా బాగానే చెప్పింది. నాకు బాగా హెల్ప్ చేస్తది అని చెప్పుకొచ్చింది. హారిక అయితే ఇంకా వంట గదికే పోలేదు అని సెటైర్ వేసిన గంగవ్వ… అఖిల్‌ను ‘గవర్నమెంట్ అఖిల్’ అని పంచ్ వేసింది. సోహైల్‌ని పంచాయతీదారు అని అంది గంగవ్వ.
* గంగవ్వకు నడకలో సాయం చేద్దామని సోహైల్ చేతులు పట్టుకొని నడిపించాడు. అప్పుడు గంగవ్వ ‘నన్నొదులు నే నడుస్తా’ అని చేయి విదిలించుకుందట. ఎందుకలా చేశావ్ అనడిగితే… ‘ఏం రెండు కాళ్లు పోయినదాన్ని పట్టుకున్నట్లు పట్టుకున్నవ్’ అని కౌంటర్ వేసింది.
* ఇంట్లోవాళ్లందరికీ ఊపు కోసం నోయల్ ర్యాప్ పాడాడు. లాంఛింగ్ స్టేజీ మీద నాగార్జున దగ్గర పాడిన ‘బిగ్‌బాస్’ ర్యాప్‌ను మరోసారి ఇంట్లో పాడాడు. అందరూ చప్పట్లతో అభినందించారు.
* లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా రెండో టాస్క్‌ను ఈ రోజు నిర్వహించారు. టమోటా పల్ప్‌ను తయారు చేసి ఇవ్వడం ఈ టాస్క్‌లో చేయాల్సిన పని. టమోటా పల్ప్ తీసి బాటిల్స్‌లో సరిగా నింపి, స్టిక్టర్లు అతికించాలి. బిగ్‌బాస్ చెప్పిన నియమాల ప్రకారం ఆ బాటిల్స్ ఉన్నాయో లేవో సోహైల్, ఆరియానా చూస్తారు. లేకపోతే రిజక్ట్ చేస్తారు. వీరికి గంగవ్వ సహాయకురాలు. ఈ టాస్క్‌కు సూర్యకిరణ్ సంచాలకులు. మొత్తం 16 మందిలో సోహైల్, ఆరియానా, సూర్యకిరణ్, గంగవ్వ ని తీసేసి మిగిలిన 12 మంది నాలుగు టీమ్‌లు చేశారు. దివి, మెహబూబ్, దేవిని ఎల్లో టీమ్ కాగా… లాస్య, మోనాల్, అఖిల్‌ను గ్రీన్ టీమ్‌గా ఎంపిక చేశారు. హరిక, నోయల్, అమ్మ రాజశేఖర్ ఆరెంజ్ టీమ్‌గా ఉన్నారు. బ్లూ టీమ్‌లో సుజాత, కళ్యాణి, అభిజిత్ ఉన్నారు. ప్రతి టాస్క్‌లాగే ఇందులో లాక్కోవడాలు, పీక్కోవడాలు జరిగాయి. తొలుత చిన్నగా మొదలైన ఝంఝాటం తర్వాత తర్వాత జోరందుకుంది. అయితే ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో ఇంకా చూపించలేదు.
* కటప్ప ఎవరు అనే ప్రశ్న డైలీ సీరియల్‌లా ఈ వారం మొత్తం లాగించేలా ఉన్నారు. తొలి రోజు రాత్రి వచ్చిన ప్రశ్న శుక్రవారం కూడా నడిచింది. కట్టప్ప ఎవరు అంటే ముఖం మీద స్టాంపులు వేసే టాస్క్ శుక్రవారం పెట్టారు. ఈ కట్టప్ప టాస్క్ పోను పోను బోర్ కొట్టిస్తున్నా బిగ్‌బాస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.