Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: వామ్మో కట్టప్ప: జనాల మాట… లాస్య చెప్పేసింది!

బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: వామ్మో కట్టప్ప: జనాల మాట… లాస్య చెప్పేసింది!

  • September 12, 2020 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: వామ్మో కట్టప్ప: జనాల మాట… లాస్య చెప్పేసింది!

బిగ్‌బాస్‌ తొలి వారం వీకెండ్‌ వచ్చేస్తోంది. ఈ రోజు రాత్రి వీకెండ్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అవుతుంది. అయితే ఇంకా షో రంజు కట్టలేదు. ఇంట్రెస్టింగ్‌ టాస్క్‌లు లేక, మాసాలా లేక చప్పగా సాగుతోంది. తొలి రోజు మొదలుపెట్టిన కట్టప్ప టాస్క్‌ను వారం మొత్తం సాగదీసి బోర్‌ కొట్టించాడు బిగ్‌బాస్‌. ఈ ఐదు రోజుల్లో కాస్త వెరైటీ చూపించింది మాత్రం ఐదో రోజే. ఇంకా ఐదో రోజు ఏం జరిగాయో చదవండి.

* నాలుగో రోజు మొదలైన టమోటా జ్యూస్‌ టాస్క్‌ ఐదో రోజు టెలికాస్ట్‌లో కంటిన్యూ చేశారు. గ్రీన్‌ టీమ్‌ సిద్ధం చేసిన 21 బాటిల్స్‌లో 18 సరిగా ఉన్నాయి. ఆరెంజ్‌ టీమ్‌ వాళ్లు రెడీ చేసిన 19 సీసాల్లో రెండు రిజక్ట్‌ అవ్వగా, 17 యాక్సెప్ట్‌ చేశారు. ఎల్లో టీమ్‌ 14 సరిగ్గా చేసింది. బ్లూ టీమ్‌ 10 బాటిల్స్‌ పక్కాగా సిద్ధం చేసింది. నిజానికి వాళ్లు 16 చేసినా.. ఆరు రిజక్ట్‌ అయ్యాయి. అయితే బిగ్‌బాస్‌ ఒక్కొక్క టీమ్‌కు 30 బాటిల్స్‌ ఆర్డర్‌ ఇవ్వగా… ఎవరూ టార్గెట్‌ రీచ్‌ అవ్వలేదు. దీంతో 14 వేల పాయింట్లకుగాను బిగ్‌బాస్‌ కేవలం 2 వేల పాయింట్లే ఇచ్చాడు.

* తనను అందరూ కట్టప్ప అనడం, తనపై జోక్స్‌ వేయడం అఖిల్‌కు నచ్చలేదు. అదే విషయాన్ని టాస్క్‌ తర్వాత మోనాల్‌తో చెబుతూ బాధపడ్డాడు. అయితే ‘సూర్యకిరణే కట్టప్ప అవ్వొచ్చని’ గంగవ్వ, కళ్యాణి అనుకున్నారు. ఇదే విషయాన్ని అఖిల్‌కు చెప్పారు.

*ఐదో రోజును బిగ్‌బాస్‌ ‘జులాయి’ పాటతో మొదలెట్టాడు. ‘పకడో పకడో…’ పాట వేయడంతో హౌస్‌ మేట్స్‌ హ్యాపీగా డ్యాన్స్‌ చేశారు. ముందు రోజు టాస్క్‌ ఫెయిల్యూర్‌ను కూడా మరచిపోయారని అనిపించింది. పాటలో ఎప్పటిలాగే అందరూ డ్యాన్స్‌లతో అలరిస్తే… గంగవ్వ తన స్లైట్‌ మూమెంట్స్‌తో మురిపించింది. ఈ సమయంలో అఖిల్‌ గ్రూప్‌తో కాకుండా… వేరేగా డ్యాన్స్‌ వేయడం గమనార్హం.

* గంగవ్వ జిమ్‌ ఏరియాకు వచ్చి… బాల్‌తో ఎక్సర్‌సైజ్‌ చేసింది. జిమ్‌ బాల్‌ను 20 సార్లు గాల్లోకి లేపి… స్టిల్‌ ఫిట్‌ అని తేల్చింది. గంగవ్వ వయసు ఎంత అంటూ అందరిలో ఉన్న ప్రశ్నలకు గంగవ్వే సమాధానమిచ్చింది. తనకు 62 సంవత్సరాలు అని చెప్పింది.

* తన జీవితం గురించి ఆరియానా అడిగితే గంగవ్వ చెప్పుకొచ్చింది. భర్త గల్ఫ్‌ వెళ్లి డబ్బులు పంపకపోయినప్పుడు పడ్డ కష్టాలు చెప్పుకొచ్చింది. తనకు నలుగురు మనవలు, ముగ్గురు మనవరాళ్ల అంటూ ఆనందంగా చెప్పింది గంగవ్వ.

* వంట గదిలో శుభ్రత గురించి మరోసారి హౌస్‌లో చర్చ జరిగింది. వంట గదిని శుభ్రంగా ఉంచండి… అని మోనాల్‌ చెప్పిన మాటకు అమ్మ రాజశేఖర్‌కు కోపం వచ్చింది. అలా ప్రతిసారి క్లీనింగ్ క్లీనింగ్‌ అని అనొద్దని చెప్పాడు. బాధపడుతున్న మోనాల్‌ను కళ్యాణి సముదాయించింది. అయితే అలా సముదాయించొద్దని సూర్యకిరణ్‌ అనేసరికి కళ్యాణి హర్ట్‌ అయ్యింది. దాంతో నేను టిఫిన్‌ చేయను అని చెప్పి వెళ్లిపోయింది. అది కూడా చర్చకు దారి తీసింది. ‘సూర్యకిరణ్‌ అందరినీ కంట్రోల్‌ చేయడం సరికాదని’ కళ్యాణి అఖిల్‌తో చెప్పింది.

* ఉదయం టిఫిన్‌ సమయంలో గొడవ జరిగితే… మధ్యాహ్నం భోజనం సమయంలో పులిహోర కార్యక్రమం జరిగింది. దివిని నువ్వు నా హీరోయిన్‌, నేను నా హీరో అంటూ అమ్మ రాజశేఖర్‌ పులిహోర కలిపేశాడు. అయితే ఆఖరులో భార్య గుర్తొచ్చి… ఇదంతా బిగ్‌బాస్‌ హౌస్‌ కోసమే అంటూ కవర్‌ చేసేశాడు. అయితే అది అక్కడితో ఆగకుండా… ‘పులిహోర’ మాయలో ఉండిపోయి కూర కోసం సిద్ధం చేసిన ఆయిల్ కలాయిలో టీ పొడి వేసేశాడు. దీంతో వంట గదిలో నవ్వుల పోపు చిటపటలాడింది.

* నోయల్‌ ఈ రోజు హారిక మీద ఓ ర్యాప్‌ పాడాడు. ‘దేత్తడి దేత్తడి’ అంటూ ర్యాప్‌ పాడి అదరగొట్టాడు. ఆ తర్వాత కరాటే కళ్యాణి మీద కూడా ర్యాప్‌ పంచ్‌ పడింది. పాటలు బాగా పాడే కళ్యాణి… మాటలు మాత్రం పరేషాన్‌ అని నవ్వించాడు. దివి చెవులు షార్ప్‌ అని, సొట్టబుగ్గలు సూపర్‌ అని పొగిడేశాడు. అన్ని ర్యాప్‌లు పాడిన నోయల్‌ కోసం మెహబూబ్‌, దేవి నాగవల్లి, దివి కలిసి ఓ ర్యాప్‌ పాడి డెడికేట్‌ చేశారు.

* ఇంట్లోకి ఐదు రోజులు అయితోంది కదా… వన్‌ టు వన్‌ డిస్కషన్స్‌ మొదలయ్యాయి. మోనాల్, అభిజిత్‌ కలసి ఓ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం అనుకున్నారు. ఎవరికి, ఏది ఇష్టం అనే వివరాలు తెలుసుకున్నారు. మోనాల్‌కు నచ్చిన రంగేంటని అభిజిత్‌ అడగగా.. ఎల్లో అని చెప్పింది. ఓ మనిషి నచ్చడానికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అని మోనాల్‌ అడగగా.. ట్రూత్‌ఫుల్‌ అని చెప్పాడు అభిజిత్‌. అలా మరికొన్ని ప్రశ్నలు కూడా వచ్చాయి.

* ఆరియానా గుడ్‌ ఫిగర్‌ ఉన్నా… డ్రెస్సింగ్‌ బాగోలేదని అఖిల్‌తో మోనాల్‌ చెప్పింది. ఆమె గురించి ఆ తర్వాత కూడా కాసేపు చర్చ జరిగింది. సోహైల్‌ కూల్‌ గయ్‌ అని చెప్పింది. ఇది కచ్చితంగా శని, ఆదివారాల్లో నాగార్జున దగ్గర చర్చకు వచ్చే టాపిక్‌లా కనిపిస్తోంది. అఖిల్‌, మోనాల్‌ కలసి మాట్లాడిన మాటలు వీకెండ్‌లో నాగ్‌ చర్చకు తెస్తాడేమో.

* బిగ్‌బాస్‌ తొలి రోజు మొదలుపెట్టిన ‘మీలో ఎవరు కట్టప్ప’ అనే కాన్సెప్ట్‌ ఈ రోజు కూడా కంటిన్యూ చేశారు. అదే టాస్క్‌ను సాగదీస్తూ… ఈ రోజు స్టాంప్‌ గేమ్‌ ఆడించాడు. మీకు కట్టప్ప అనిపించేవారి ముఖంపై కట్టప్ప స్టాంప్‌ వేయమన్నారు. లాస్యను కట్టప్ప అని అఖిల్‌, మెహబూబ్‌ అన్నారు. లాస్య, హారిక వచ్చి సూర్యకిరణ్‌పై కట్టప్ప స్టాంప్‌ వేశారు. సోహైల్‌ వచ్చి అఖిల్‌కి స్టాంప్‌ వేశాడు. అమ్మ రాజశేఖర్‌ను కట్టప్ప అని మోనాల్‌ అనుకుంది. దివి, అమ్మ రాజశేఖర్‌, ఆరియానా, దేవి నాగవల్లి దృష్టిలో నోయల్‌ కట్టప్ప అయ్యాడు. టాస్క్‌ల విషయంలో నోయల్‌ కట్టప్పలా వ్యవహరించాడని వాళ్లు కట్టప్పను చేశామని చెప్పారు.

* నోయల్‌ టర్న్‌ వచ్చేసరికి… టాస్క్‌లో ట్విస్ట్‌ వచ్చింది. నాకు నేనే కట్టప్ప అనుకుంటూ స్టాంప్‌ వేసుకోబోయాడు. దానికి హౌస్‌ మేట్స్‌ అంగీకరించలేదు. అయినప్పటికీ నోయల్‌ స్టాంప్‌ వేసుకున్నాడు. తీరా బిగ్‌ బాస్‌ సెల్ఫ్‌ స్టాంప్‌ వీలు లేదు అని చెప్పడంతో అమ్మ రాజశేఖర్‌ మీద వేశాడు. సూర్యకిరణ్‌ వచ్చి నోయల్‌ కే స్టాంప్‌ వేశారు. కళ్యాణి అయితే చాలా డిస్కస్‌ చేసి… నోయల్‌ని కాదని, సూర్యకిరణ్‌కే వేసింది. సుజాత, అభిజిత్‌ కూడా లాస్యకే కట్టప్ప స్టాంప్‌ వేశారు. బయట జనాలు అనుకుంటున్న మాటను లాస్య అనేసింది. అదే ‘ఇంకెన్నాళ్లు ఈ కట్టప్పను సాగదీస్తారు’ అంటూ బిగ్‌బాస్‌కే పంచ్‌ వేసింది.

* ఇంట్లో రకరకాల గ్యాంగ్‌లు ఉన్నాయంటూ అమ్మ రాజశేఖర్‌ కొత్త డిస్కషన్‌ తీసుకొచ్చాడు. ఒక గ్యాంగ్‌ ఉంటే.. అక్కడ ఇంకో గ్యాంగ్‌ ఉండదు అని అన్నాడు. ఒకటి బ్రెడ్‌, జామ్‌ తినే ఫారిన్‌ గ్యాంగ్‌ ఉంటే… ఇంకొకటి మన లాంటి స్ట్రీట్‌ గ్యాంగ్‌ అంటూ జోకేశాడు. లాస్యను అందరూ కట్టప్ప అంటే ఏం చేస్తుందంటూ యాక్టింగ్‌ చేసి చూపించాడు అమ్మ రాజశేఖర్‌. లాస్య అయితే ఎంజాయ్‌ చేస్తూ… మరోసారి అడిగి ఇమిటేట్‌ చేయించుకుంది. సోహైల్‌తోపాటు మరొకరిని అనవసరమైన వ్యక్తులు అని అమ్మ రాజశేఖర్‌ నవ్వుతూ అనేశాడు. అయితే అక్కడే సోహైల్‌ ఉండటం… గమనించి అమ్మ రాజశేఖర్‌ నవ్వేశాడు. అయితే ఇది తర్వాత గొడవలకు దారితీసేలా కనిపిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar
  • #Bigg boss

Also Read

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

related news

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

trending news

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

44 mins ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

11 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

13 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

14 hours ago

latest news

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

3 mins ago
Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

15 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

16 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

17 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version