బిగ్ బాస్ 4: ఆఖరిగా ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అనేది రసవత్తరంగా ఉండబోతోంది. హౌస్ లో అఖిల్ తప్ప అందరూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. సోహైల్, అభిజిత్, హారిక, మోనాల్, ఇంకా అరియానాలు ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఓటింగ్ పోల్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ డే ఓటింగ్ ని బట్టీ చూస్తే డేంజర్ జోన్ లో ఇద్దరు కనిపిస్తున్నారు. వారిలో అరియానా, ఇంకా మోనాల్ ఇద్దరూ ఉన్నారు.

నిజానికి అరియానాకి బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత మంచి ఫాలోయింగ్ వచ్చింది. కానీ, గత కొన్నివారాలుగా అరియానా గేమ్ డల్ అయిపోవడం వల్ల ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పడిపోయింది. ఇదే టైమ్ లో మోనాల్ అరియానాని డామినేట్ చేసి తన గేమ్ పవర్ ని చూపించింది. అరియానా కంటే కూడా తన ఓటింగ్ ని పెంచుకుంటూ వెళ్లింది.

ప్రస్తుతం అరియానా కంటే కూడా మోనాల్ తనని తాను నిరూపించుకునేలాగానే కనిపిస్తోంది. ఇంకా నాలుగురోజులు ఓటింగ్ ఉంటుంది కాబట్టి, మోనాల్ లాస్ట్ మినిట్ లో సేఫ్ జోన్ లోకి వస్తే అరియానా వెళ్లిపోతుందనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. ఎందుకంటే, అభిజిత్, హారిక, సోహైల్ ముగ్గురూ కూడా గ్రీన్ జోన్ అంటే సేఫ్ జోన్ లోనే ఉన్నారు. సో, ఈ లెక్కల ప్రకారం చూస్తే మోనాల్ కి – అరియానికి ఇద్దరిమద్యలోనే పోటీ అనేది ఉంటుంది. మోనాల్ కి కాస్త ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఆఖరిగా ఎలిమినేట్ అయ్యేది అరియానానే అని అంటున్నారు అందరూ. ఇంకా టైమ్ ఉంది కాబట్టి, మరి చూద్దాం.. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది.

[yop_poll id=”1″]

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus