Bigg Boss Telugu 5: బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ గా హౌస్ మేట్స్ షాక్ తిన్నారా..?

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి నామినేషన్స్ ప్రక్రియ అనేది జరగబోతోంది. ఇందులో భాగంగా 6 పొజీషన్ బోర్డ్స్ ని పెట్టి వాటిపై ఉండే అర్హత ఎవరికి ఉందో, వారు ఏ పొజీషన్ లో ఉండాలని భావిస్తున్నారో నుంచోవాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో హౌస్ మేట్స్ పొజీషన్స్ లోకి వచ్చేందుకు ఘర్షణ మొదలుపెట్టారు. ముఖ్యంగా నెంబర్ వన్ పొజీషన్ కావాలి అంటూ షణ్ముక్ ఇంకా సిరిలు మాట్లాడుకున్నారు. అలాగే, ఎవరు వన్ ఎవరు సిక్స్ అనేది జనాలు నిర్ణయిస్తారు అంటూ సన్నీ మానస్ తో అన్నాడు. ఇది ప్రోమోలో చూపించిన సంగతి తెలిసిందే.

అయితే, ఈసారి నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు అనేదానిపైనే టాప్ 5 అనేది ఆధాపడి ఉంటుంది. ఇక నామినేషన్స్ లో శ్రీరామ్ తప్పించి అందరూ నామినేషన్స్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. నెంబర్ గేమ్ లో భాగంగా ఏ పొజీషన్ లో ఉండాలన్నది అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఫస్ట్ ప్లేస్ లో సన్నీ, సెకండ్ ప్లేస్ లో షణ్ముక్, థర్డ్ ప్లేస్ లో కాజల్, నాలుగో ప్లేస్ లో శ్రీరామ్ చంద్ర, ఐదో స్థానంలో మానస్, ఆరోస్థానంలో సిరి నిలబడ్డారు. ఫైనల్ గా ఆర్గ్యూమెంట్స్ అయ్యాక ఈ పొజీషన్స్ లో హౌస్ మేట్స్ నుంచుని ఉన్నట్లుగా సమాచారం.

అయితే, ఇక్కడే ఫినాలే టిక్కెట్ సాధించిన కారణంగా శ్రీరామ్ చంద్రని సేఫ్ చేశాడు బిగ్ బాస్. ఆర్గ్యూమెంట్స్ అనేవి బలంగా జరగడం, ఒకరి పొజీషన్ కి మరొకరు నుంచోవడం వల్ల హౌస్ లో అందరూ నామినేట్ అయ్యారని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ శ్రీరామ్ కి ఏదైనా పవర్ ఇచ్చి నెంబర్ పొజీషన్స్ ని మార్చే ట్విస్ట్ ఇచ్చాడా లేదా అనేది తెలియాలి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. ఇందులో ఐదుగురు నామినేషన్స్ లోకి వస్తే అసలు సిసలైన విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఈవారం ఓటింగ్ పొజీషన్స్ ని బట్టీ ఈసీజన్ విన్నర్ ని డిసైడ్ చేయచ్చని చెప్తున్నారు బిగ్ బాస్ విశ్లేషకులు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus