Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తొలి రోజు ఏం జరుగుతుందంటే?

  • August 27, 2021 / 11:15 AM IST

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కోసం వెయిట్‌ చేస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్‌. తొలి రోజు చూపించే ఇంట్రో సాంగ్స్‌ షూటింగ్‌ పూర్తయిపోయిందట. ఏంటీ… సెప్టెంబరు ఐదో తేదీ చూపించే ఇంట్రడక్షన్‌ అప్పుడే చేసేశారా అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడూ ఇలాగే చేస్తుంటారు కాబట్టి. సెప్టెంబరు ఐదున సాయంత్రం ఆరు గంటల నుండి మొదలయ్యే ఈ షోకు సంబంధించిన షూటింగ్‌ పనులు మొదలయ్యాయి. అందులో భాగంగా హోస్ట్‌ నాగార్జున, ఇంట్లోకి వెళ్లునున్న కంటెస్టెంట్ల ఎంట్రీలు షూట్‌ చేసేశారట. ఇంట్రోలు ఇలా జరిగాయంటూ… సోషల్‌ మీడియాలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

సోషల్‌ మీడియా వైరల్‌ పాయింట్ల ప్రకారం చూస్తే… తొలి రోజు స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌లు అదిరిపోనున్నాయి. యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌తో ఆ రోజు కంటెస్టెంట్ల ఎంట్రీ మొదలవ్వబోతోంది. మొత్తంగా 16 మంది షోలో ఎంటర్‌ అవుతారని తెలుస్తోంది. షణ్ముఖ్‌ ‘వన్‌ నేనొక్కడినే’లోని ‘హు ఆర్‌ యూ..’ పాటతో అదరగొట్టబోతున్నాడు. ‘సరైనోడు’ టైటిల్‌ సాంగ్‌తో యాంకర్‌ రవి రాబోతున్నాడట. ‘పుష్ప’లోని ‘పులి మేక..’ పాటతో కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌ మాస్టర్‌ ఎంట్రీ ఇస్తారట. ఇక మరో డ్యాన్స్‌ మాస్టర్‌ ఆనీ ‘తెలుసా తెలుసా..’ అంటూ సాఫ్ట్‌గా వస్తారట. పవన్‌ కల్యాణ్‌ పాటల మెడ్లీతో మానస్‌ను తీసుకొస్తారు.

‘పాగల్‌’ టైటిల్‌ సాంగ్‌తో కమెడియన్‌ లోబో వస్తాడట. ‘క్రాక్‌’లో ‘భూమ్‌ బద్దలు…’ పాటతో సిరి హన్మంత్‌ స్టేజ్‌ను అదరగొట్టబోతోందట. ఇంకా మిగిలిన వాళ్లు కూడా ఇలాంటి పెప్పీ నెంబర్స్‌తో ఎంట్రీలు ఇస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేశారని తెలుస్తోంది. ఆయన ఆధ్వర్యంలో మరో ఇద్దరు దర్శకులు, నలుగురు కెమెరామెన్ ఈ షూట్‌లో పాల్గొన్నారట. ఇక నాగార్జున స్టేజీపైకి వచ్చిన కంటెస్టెంట్లను పిలిచే ముందు దేశంలో కరోనా విలయతాండవం గురించి మాట్లాడతారని తెలుస్తోంది. అలాగే కంటెస్టెంట్లను 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచామని చెబుతారట. అయితే అన్ని రోజులు ఉన్నారా అంటే… సమాధానం మీకు తెలిసిందే.

Most Recommended Video



చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus