Bigg Boss 7 Telugu: ఊహించని విధంగా.. కుమ్మేసిన బిగ్ బాస్ 7 టి.ఆర్.పి రేటింగ్!

నార్త్ లో సక్సెస్ అయిన ‘బిగ్‌బాస్‌’ రియాలిటీ షో తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. కాని 5 సీజన్ల వరకు మాత్రమే సక్సెస్ ఫుల్ గా సాగింది అని చెప్పాలి. కానీ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ ఓటీటీ సీజన్ మొదలయ్యాక దాని హవా తగ్గింది. సీజన్ 6 అయితే మరీ ఘోరం. ఆ సీజన్ కి రేటింగ్ చాలా తక్కువగా వచ్చింది. దీంతో బిగ్ బాస్ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు.

సీజన్ 7 ఈ మధ్యే ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ను చూస్తే… సీజన్ 6 కి మించి డిజాస్టర్ అవుతుంది అని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ హౌస్ కి స్పెషల్ అట్రాక్షన్ అయిన వ్యక్తి వాయిస్ కూడా మార్చేశారు. కాబట్టి.. సీజన్ 7 టి.ఆర్.పి ఆశలు వదిలేసుకోవచ్చు అనే కామెంట్లు కూడా వినిపించాయి. కానీ ఈ సీజన్ కి ఊహించని విధంగా ఎక్కువ టి.ఆర్.పి రేటింగ్ వచ్చింది.

అవును బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7 Telugu) ప్రీమియర్ కి ఏకంగా … 18.1 టి.ఆర్.పి రేటింగ్ నమోదైంది. దాదాపు 5.1 కోట్ల మంది ప్రేక్షకులు ఈ ప్రీమియర్ ను వీక్షించినట్టు .. స్టార్ మా వారు ప్రకటించారు. అంటే సీజన్ 7 సక్సెస్ సాధించినట్టే అని చెప్పుకోవచ్చు. మరి వీక్ డేస్ లో కూడా ఈ షోకి కూడా మంచి టి.ఆర్.పి వస్తుందా అనేది స్టార్ మా వారు ప్రకటించాలి

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus