Bigg Boss 7 Telugu: వామ్మో బిగ్ బాస్ 7 సీజన్ అంత మంది చూస్తున్నారా..!

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ కి కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా ఆదరణ లభిస్తోందని స్టార్ మా తెలిపింది. “బిగ్ బాస్ సీజన్ 7” ఎన్నో సంచలనాలకు వేదికైందని పేర్కొంది. రేటింగ్స్ , వ్యూయర్ షిప్ పరంగా ఊహించని ఎన్నో అద్భుతాలకు “బిగ్ బాస్ సీజన్ 7” వేదికగా నిలిచిందని పేర్కొంది. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని తెలిపింది. దాదాపు 5.1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని పేర్కొంది.

“బిగ్ బాస్ సీజన్ 7” (Bigg Boss 7 ) లాంచ్ ప్రోగ్రామ్ ను సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో గతంలో క్రికెట్ మ్యాచ్ ల వ్యూస్ ల పరంగా నమోదైన రికార్డులను కూడా ఈ ప్రోగ్రాం అధిగమించిందని పేర్కొంది. గత సీజన్ లో సాధించిన రేటింగ్స్ తో పోల్చితే 40 శాతం అధిక రేటింగ్ సాధించిందని తెలిపింది. ఈ సీజన్ ఉల్టా పల్టాగా ఉండబోతుందని ఈ షో వ్యాఖ్యాత నాగార్జున ప్రోమోలో చెప్పిన నాటి నుంచి దీనిపై అంచనాలు బాగా పెరిగాయని పేర్కొంది. అత్యధిక టీవీఆర్ 18.1 సాధించినట్లు తెలిపింది.

స్టార్ మాలోనే కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూ ట్యూబ్ లో కూడా “బిగ్ బాస్ సీజన్ 7” కు ఆదరణ బాగా ఉందని పేర్కొంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో మాయాస్త్రం కోసం కంటెస్టెంట్స్ పోటీపడడం మొదలుపెట్టారు. ప్రస్తుతం మాయాస్త్రం గెలుచుకొని రెండో పవర్ అస్త్రా కోసం పోటీపడుతున్నవారి లిస్ట్‌లో అమర్‌దీప్, శివాజీ, షకీలా, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక ఉన్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus