Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 : పృథ్వీ-నబీల్ జీవితాల్ని మార్చేసిన రోజు.. ఎమోషనల్ అయిన హౌస్మేట్స్!

Ad not loaded.

బిగ్‌బాస్ (Bigg Boss 8 Telugu) ప్రోమోలు క్యూరియాసిటీని క్రియేట్ చేయడంతో పాటు అందరినీ ఎమోషనల్ అయ్యే విధంగా కూడా చేస్తుంటాయి. లేటెస్ట్ ప్రోమోలో శేఖర్ బాషా (Shekar Basha) తనకు ఇంటి దగ్గర్నుండీ వచ్చిన గిఫ్ట్ ని చూపించాడు. శేఖర్ భాషాకి ఇంటి నుండి వచ్చింది.. తనకి ఇష్టమైన ‘బుజ్జి కుక్క పిల్ల’. తర్వాత సోనియా కోసం ఓ పిల్లో (దిండు) వచ్చిందట. మణికంఠ (Naga Manikanta) కోసం వాళ్ల అమ్మగారి చీర వచ్చింది. ఆదిత్య ఓంకి అతని తండ్రి ఫోటో వచ్చింది.

Bigg Boss 8 Telugu

ఇక ఈ గిఫ్ట్..లు అవి చూసుకుని హౌస్మేట్స్ కాసేపు ఎమోషనల్ అయ్యారు. ఇదే క్రమంలో నబీల్ (Nabeel Afridi) -పృథ్వీ (Prithviraj)  ..లు తమకి వచ్చిన బహుమతుల గురించి చెప్పి అందరినీ కన్నీళ్లు పెట్టించేసారు అని చెప్పాలి. ‘మా నాన్నగారితో అది నా చివరి ఫోటో.. కోవిడ్ టైంలో ఆయన చనిపోయారంటూ’ నబీల్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు పృథ్వీ కూడా ఎమోషనల్ అయిపోయాడు. తర్వాత ‘నేను మా నాన్నతో కరెక్ట్‌గా మాట్లాడిందంటే ఆగస్ట్ 15 అని పృథ్వీ చెబుతుండగా…

అది మా నాన్న బర్త్‌డే అంటూ నబీల్ తెలిపాడు. అందుకు పృథ్వీ ‘అది మా నాన్న చనిపోయిన రోజు’ అంటూ చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో నబీల్ తో పాటు హౌస్లో ఉన్నవాళ్ళంతా ఏడ్చేశారు. ‘నవ్వే వాళ్ళతో నవ్వకపోయినా పర్వాలేదు.. ఏడ్చేవాళ్ళతో మాత్రం ఏడవాలి’ అనే పద్ధతిని హౌస్మేట్స్ అంతా పాటించారు. అంటే బాధల్లో ఉన్నవాళ్ళని ఓదార్చడానికి ముందుండాలనేది ఆ లైన్ ఉద్దేశం. ప్రోమోకే ఇలా ఉంటే.. ఇక ఫుల్ ఎపిసోడ్ చూస్తే.. ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయిపోతారేమో

బిగ్ బాస్ 8 సోనియా, నిఖిల్, పృథ్వీ .. ఏం జరుగుతుంది?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus