Adi Reddy Income: నెలకు లక్షల్లో సంపాదన… ఎంతనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • November 15, 2023 / 02:49 PM IST

బిగ్ బాస్ రివ్యూలు చెప్పి ఫేమస్ అయిన ఆదిరెడ్డి.. గత సీజన్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వెళ్ల ఫైనలిస్ట్‌గా నిలిచారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ఆదిరెడ్డి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన ఇచ్చే రివ్యూలు చాలా జెన్యూన్ గా ఉండడంతో ఈయనని అనుసరించే వారు కూడా ఎక్కువ అయ్యారు అయితే ఈమధ్య కాలంలో కొందరి కంటెస్టెంట్స్ గురించి భజన చేస్తున్నటువంటి ఆదిరెడ్డి గురించి ఎన్నో రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వారి దగ్గర డబ్బు తీసుకొని వారిని పొగుడుతూ ఉన్నారని పెయిడ్ రివ్యూయర్ అంటూ ఈయన గురించి వార్తలు రావడంతో ఈ విమర్శలపై ఆదిరెడ్డి స్పందిస్తూ ఒక వీడియో చేశారు. తాను ఎవరి దగ్గర డబ్బు తీసుకొని రివ్యూలు ఇవ్వడం లేదని తెలిపారు ఒకవేళ పెయిడ్ చేసిన వారికి ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే బయట ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది అయినా వారి దగ్గర డబ్బు తీసుకొని ఎన్ని రోజులని వారి గురించి పొగడగలము అంటూ ఈయన ఆ వార్తలను ఖండించారు.

ఇలా తాను ఎవరి దగ్గర డబ్బు తీసుకొని రివ్యూ ఇవ్వడం లేదని, బిగ్ బాస్ కంటెస్టెంట్ లో హౌస్ లో పడుకున్నప్పుడే నేను కూడా ఇక్కడ నిద్రపోతున్నానని 24/7 చూస్తూ ఎన్నో గంటలు కష్టపడుతూ తాను రివ్యూస్ ఇస్తున్నానని తెలియజేశారు. ఇకపోతే తాను ఫేక్ రివ్యూ ఇస్తే ఎవరు చూడరని తనకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారని, తన గత నెల సంపాదన ఎంత అనే విషయాల గురించి కూడా ఆదిరెడ్డి బయట పెట్టారు. తాను యూట్యూబ్ వీడియోస్ ద్వారా గత నెల 39 లక్షల రూపాయలు సంపాదించాను అంటూ ఈయన షాకింగ్ న్యూస్ బయట పెట్టారు.

కేవలం యూట్యూబ్ ద్వారా నెలకు 39 లక్షలు సంపాదించాను అంటూ ఆది రెడ్డి చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. యూట్యూబ్ ద్వారా ఒక్క నెలలో ఇంత సంపాదించవచ్చా అంటూ అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ డబ్బులు నాకు ఊరికే రాలేదని ఎవరు నాకు పెయిడ్ చేయలేదని యూట్యూబ్ నేను చేసిన వీడియోలు పే చేస్తుంది అంటూ ఈయన తెలిపారు. ఈ డబ్బు వెనుక నా కష్టం కూడా ఎంతో ఉందని ఆదిరెడ్డి (Adi Reddy) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus