Adireddy: అర్థం చేసుకోండంటూ రిక్వెస్ట్ చేసిన బిగ్ బాస్ ఆదిరెడ్డి.. ఏమైందంటే?

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో బిగ్ బాస్ ఆదిరెడ్డి ఒకరు. ప్రస్తుతం బిగ్ బాస్ రివ్యూల ద్వారా ఆదిరెడ్డి సత్తా చాటుతున్నారు. బిగ్ బాస్ రివ్యూల ద్వారా ఆదిరెడ్డికి నెలకు 39 లక్షల రూపాయల ఆదాయం వచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే ఆదిరెడ్డి నుంచి సాయం కోరుతూ ఆయన ఇంటికి, సెలూన్ కు వెళ్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

నా నుంచి సహాయం ఆశించేవాళ్లు దయచేసి అర్థం చేసుకోవాలని నాకు తోచిన సహాయం నేను చేస్తున్నానని నాకు వీలైనంత సహాయం చేస్తూనే ఉంటానని ఆదిరెడ్డి కామెంట్లు చేశారు. కానీ డైరెక్ట్ గా ఇంటికి చాలామంది వస్తున్నారని వాళ్లందరికీ నేనేం చేయగలనని ఆదిరెడ్డి ప్రశ్నించారు. ఎవరొచ్చినా 150 రోజుల భోజనం పెట్టించగలనని వాళ్ల బాధలను చెప్పినా ఏం చేయలేని పరిస్థితి అని ఆదిరెడ్డి కామెంట్లు చేశారు.

దయచేసి ఎవరూ కూడా ఇంటికి కానీ సెలూన్ కు కానీ రావొద్దని ఆదిరెడ్డి పేర్కొన్నారు. సమాజానికి నా వంతు కృషి చేస్తానని అలా అని చెప్పి అందరికీ సహాయం చేయడం సాధ్యం కాదని ఆదిరెడ్డి అన్నారు. ఎలాగోలా వచ్చిన వాళ్లకు ఛార్జీలు ఇచ్చి పంపుతున్నానని ఆదిరెడ్డి కామెంట్లు చేశారు. దయచేసి అర్థం చేసుకోవాలని తప్పుగా అనుకోవద్దని నాతో మాట్లాడాలంటే కామెంట్స్, మెసేజ్ ల ద్వారా పంపాలని ఆదిరెడ్డి పేర్కొన్నారు.

ఆదిరెడ్డి (Adi Reddy) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఆదిరెడ్డి చేసిన కామెంట్లలో కూడా నిజం ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఆదిరెడ్డి కెరీర్ పరంగా, బిజినెస్ లో సత్తా చాటాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆదిరెడ్డిని అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అతని యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య కూడా ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus