ఇది క‌దా జ‌నాలకు కావ‌ల్సింది.. ఇప్ప‌టి నుండి క‌థ వేరేగా ఉంటుంది బాస్..!

బిగ్ బాస్ నాల్గొవ సీజన్ ముగియ‌డానికి ఇక కొన్ని రోజులే మిగిలాయి. స్నేహాలు, ప్రేమ‌లు, అల‌క‌లు, గొడ‌వ‌లు, ముఖ్యంగా బిగ్‌బాస్ పెట్టే ఫిటింగ్గుల‌తో ఈ సీజ‌న్ విజ‌య‌వంతంగానే సాగుతోంది. రేస్ టు ఫినాలేకు చేరుకున్న నేప‌ధ్యంలో షోని ర‌స‌వ‌త్త‌రంగా మార్చేందుకు బిగ్‌బాస్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేసుకున్నాడ‌ని తెలుస్తోంది. అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో త‌న‌ని ఏకిపారేస్తుండ‌డంతో ప‌ర్స‌న‌ల్‌గా తీసుకున్న బిగ్‌సామి హౌస్‌లో క‌థ వేరే లెవ‌ల్లో ఉండేలా స్కెచ్ వేశాడు.

ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుల‌కు బిగ్‌బాస్ ఇచ్చే థ్రిల్స్ ఏ రేంజ్‌లో ఉండ‌నున్నాయో తాజాగా విడుద‌ల చేసిన ప్రోమో చూస్తే అర్ధ‌మ‌వుతోంది. వీకెండ్ శ‌నివారం కావ‌డంతో నాగార్జున ఎంట్రీ మామూలే.. అయితే ఎప్పుడూ కూల్‌గా సున్నితంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల‌ను క్లాస్ పీకే మిస్ట‌ర్ మ‌న్మ‌థుడు, ఈరోజు మాత్రం ఫుల్ ఫైర్‌లో ఉన్న‌ట్లు తాజా ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మొద‌ట హారిక‌కు సున్నితంగా క్లాస్ పీకిన నాగార్జున‌, అభిజిత్‌ను మాత్రం ఓ రేంజ్‌లో లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడ‌నిపిస్తోంది.

అభిజిత్ క్లారిటీ ఇవ్వ‌డానికి ఎంత ప్ర‌య‌త్నించినా, క‌నిక‌రించ‌ని నాగ్‌.. ఏకంగా వీడియోను ప్లే చేసి మ‌రీ అభిజిత్ గ‌తంలో చేసిన మిస్టేక్‌ను బ‌హిరంగం చేశాడు. ఆ త‌ర్వాత అభి క్ష‌మాప‌ణ కోరుతూ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌గా, క‌న్విన్స్ అవ్వ‌ని నాగార్జున, బిగ్‌బాస్ రూల్స్ అంటే రూల్సే.. బిగ్‌బాస్ ఇచ్చిన చేయ‌క‌పొవ‌డం పెద్ద త‌ప్పు అంటూ అభి పై ఫైర్ అయిన నాగార్జున, ఒక్క‌సారిగా బిగ్‌బాస్ ఓపెన్ ద డోర్స్ ప్లీజ్ అంటూ హౌస్‌మేట్స్‌తో స‌హా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా జ‌నాల‌కు మాత్ర థ్రిల్‌తో పాటు మంచి కిక్ ఇచ్చేలా ప్రోమోను క‌ట్ చేసి విడుద‌ల చేశారు.

అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో పాయింట్ ఏంటంటే.. మిస్ట‌ర్ కూల్‌గా గేమ్‌ను బాగా అర్ధం చేసుకుని చాలా ఆడుతాడ‌ని, అభి భిహేవియ‌ర్ కూడా చాలా మెర్చ్యూర్‌గా ఉంటాడ‌ని హౌస్‌లోనూ, బ‌య‌ట ముఖ్యంగా సోష‌ల్ మీడియాలోనూ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అంతే కాకుండా నాగార్జున అండ్ ఫ్యామిలీ స‌పోర్ట్ కూడా ఉంద‌ని దీంతో ఫైన‌ల్‌గా విన్న‌ర్ అయ్యేది అభిజిత్ అని అభిప్రాయ‌ప‌డుతున్న వారంద‌రికీ తాజా ప్రోమోతో, బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించ‌ని సంఖేతాలు పంపాడు.

హౌస్‌మేట్స్‌తో మ‌నం ఎలా ప్ర‌వ‌ర్తించాం.. హౌస్‌లో ఉన్న ఇత‌రుల‌తో మ‌న భిహేవియ‌ర్ ఎలా ఉంది.. అనే దానిపైనే ఆధార ప‌డిఉంటుంద‌ని, బిగ్‌బాస్ టెస్టింగ్‌లో భాగంగా ఇచ్చే టాస్కుల్ని ప‌ర్స‌న‌ల్‌గా అండ్ ఎమోష‌న‌ల్‌గా తీసుకుని క్విట్ చేస్తే.. అంత‌కు ముందు ఎంత మంచి ఒపీనియ‌న్ ఉన్నా స‌రే నిర్మొహ‌మాటంటా హౌస్ నుండి బ‌య‌ట‌కు వెళ్ళాల్సిందే అని, ఇక్క‌డ జంట‌గానో, గ్రూపుగానో ఆడితే కుద‌ర‌ద‌ని, గేమ్ గేమ్‌లాగే ముఖ్యంగా సోలోగానే ఆడాల‌ని.. అలాంటి వారికే టైటిల్ విన్ అయ్యే చాన్స్ ఉంద‌ని బిగ్‌బాస్ త‌న‌దైన స్టైల్‌లో సంకేతాలు పంపించాడు. దీంతో బిగ్‌బాస్ ముస‌లోడో కుర్రోడో తెలియ‌దు కానీ.. మామూలోడు మాత్రం కాద‌ని.. జ‌నాల‌కు కావ‌ల్సింది ఇదే అని ఇకముందు బిగ్‌బాస్ హౌస్‌లో క‌‌థ వేరేగా ఉంటుంది స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.


బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus