‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్ శ్వేతా వర్మ (Swetha Varma) అందరికీ సుపరిచితమే. ఇక ఈరోజు ఆమె తన తల్లి మరణించింది అన్నట్టు ఓ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘డిసెంబర్ 2, తెల్లవారుజామున 2 గంటల 35 నిమిషాలకు నా తల్లిని పోగొట్టుకున్నాను. ‘జీవితం నువ్వు లేకుండా ఇదివరకటిలా ఉండదు అమ్మా. నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ తో ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టింది.
Swetha Varma
ఇది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అంతా ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ‘నో మెసేజెస్ జస్ట్ ప్రే(ప్రార్ధించండి)’ అన్నట్టు ఇంకో పోస్ట్ పెట్టింది. వాస్తవానికి శ్వేతా వర్మ తల్లి చనిపోయింది 2017 డిసెంబర్ 2న అని తెలుస్తుంది. కానీ ఈరోజు డిసెంబర్ 2 కావడంతో.. ఆమె తల్లిని గుర్తుచేసుకుంటూ పెట్టిన పోస్ట్..ని అంతా వేరే విధంగా అర్థం చేసుకున్నారు.
శ్వేతా వర్మ (Swetha Varma) కూడా తన పోస్టులో ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల అంతా కంగారు పడ్డారని స్పష్టమవుతుంది. అందుకే కొంతమంది ఆమెను తిట్టిపోస్తున్నారు. గతంలో ‘మనం’ వంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చాలా బోల్డ్ గా నటించి హాట్ టాపిక్ అయ్యింది. అయినా క్లిక్ అవ్వకపోవడంతో ‘బిగ్ బాస్ 5’ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది.
అయినప్పటికీ అక్కడ కూడా హౌస్లో ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక.. ఈమె చిన్న, చితకా సినిమాల్లో నటించింది. కానీ అవి కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే.. మరోపక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తూ వస్తోంది.