Bigg Boss: ఏడుగురు మంది ఓకే అయ్యారట.. నిజమేనా

తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ కాస్త కుదురుకుంటుండటంతో ‘బిగ్‌బాస్‌’ కొత్త సీజన్‌కు సమయం దగ్గరపడింది అంటున్నారు. అవును ‘బిగ్‌బాస్‌ 5’ రావడానికి ఇదే సరైన సమయం అని మాటీవీ, బిగ్‌బాస్‌ టీమ్‌ భావిస్తోందట. దీని కోసం ఇప్పటికే కంటెస్టెంట్ల ప్రాబబుల్స్ను టీమ్‌ సిద్ధం చేసిందట. వారికి ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు కూడా జరిగాయని వార్తలు వచ్చాయట. మరోవైపు సెట్‌ పని కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ క్రమంలో కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని పేర్లు చాలా రోజుల నుండి వినిపిస్తున్నవే.

గతేడాది కరోనా ఫస్ట్‌ వేవ్‌ కారణంగా ‘బిగ్‌బాస్‌ 4’ను ఆలస్యంగా ప్రారంభించారు. అయితే ఈ సారి వచ్చే నెలాఖరులో కానీ, ఆగస్టు తొలి వారంలో కానీ షో మొదలవుతుందని చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా సెట్‌ పనులు వేగవంతం చేశారట. ఎప్పటిలాగే అన్నపూర్ణ స్టూడియోలోనే సెట్‌ ఉంటుంది. మరోవైపు హోస్ట్‌గా నాగార్జుననే కొనసాగుతారు. అయితే ఈసారి థీమ్‌ ఇంకొంచెం కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారట. కరోనా ప్యాండమిక్‌ ప్రోటోకాల్‌ గతేడాది మాదిరిగానే ఫాలో అవుతారట.

ఇక ఈసారి ఇంట్లోకి ఎవరెవరు వెళ్తారు అనేది చూసుకుంటే ఇప్పటివరకు పది మంది ఓకే అయ్యారని గట్టిగా పుకార్లు వస్తున్నాయి. వాటి ప్రకారం చూసుకుంటే యూట్యూబర్‌ షణ్ముక్‌, టిక్ టాక్ దుర్గారావు, యాంకర్‌ శివ, సింగర్‌ మంగ్లీ, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ ప్రత్యుష ఉంటారట. అయితే వీరిలో ఎంతమంది ఆ రోజు ఇంట్లోకి వస్తారనేది చెప్పలేం. మొత్తం 16 మంది ఎంపిక చేస్తారనే పుకార్లూ వినిపిస్తున్నాయి. అంటే మరో తొమ్మిది మంది విషయం తేలాల్సి ఉంది. రానున్న రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చేస్తుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus