Aadi Reddy : రాహుల్ సిప్లిగంజ్ చేతుల మీదుగా బిజినెస్ ప్రారంభం?

నెల్లూరుకి చెందిన ఆదిరెడ్డి ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ యూట్యూబ్ లో రివ్యూలు, వీడియోలు పోస్టుచేసేవాడు. అయితే ఈయన బిగ్ బాస్ కార్యక్రమం పై కాస్త ఫోకస్ పెట్టి రివ్యూ ఇవ్వడంతో ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇలా బిగ్ బాస్ రివ్యూ ఇస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆదిరెడ్డి ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ఈయన టాప్ 5 వరకు చేరుకొని మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక బిగ్ బాస్ తర్వాత తన లైఫ్ కాస్త మారిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నటువంటి ఈయన బిగ్ బాస్ రివ్యూలు ఇస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇకపోతే ఒకవైపు బిగ్ బాస్ రివ్యూలు యూట్యూబ్ వీడియోలు చేస్తూనే ఈయన సరికొత్త బిజినెస్ కూడా ప్రారంభించారని తెలుస్తుంది. ఈ బిజినెస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రముఖ బిగ్ బాస్ విన్నర్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయవాడలో ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్ బ్రాంచ్ తీసుకొని ప్రారంభించాడు. ఈ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈయన చేతుల మీదుగా ఈ సెలూన్ ప్రారంభించారు.

ఇక ఈయన (Aadi Reddy) కూడా గతంలో బార్బర్ గా పనిచేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాహుల్ ని ఆదిరెడ్డి ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ఈ సెలూన్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు ఆదిరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus