Maanas Car Cost: బిగ్ బాస్ మానస్ కొనుగోలు చేసిన కొత్త కారు ఖరీదెంతో తెలుసా?

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న కంటెస్టెంట్లలో మానస్ ఒకరు కాగా మానస్ సీరియళ్ల ద్వారా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం పెళ్లి చేసుకున్న మానస్ తాజాగా ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు మరికొన్ని సినిమాలలో బిగ్ బాస్ మానస్ నటించారు. బ్రహ్మముడి సీరియల్ తో బుల్లితెరపై గుర్తింపును సంపాదించుకున్న మానస్ నవంబర్ 23వ తేదీన శ్రీజ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే మానస్ బెంజ్ కార్ ను కొనుగోలు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. మానస్ కొనుగోలు చేసిన కారు ధర 85 లక్షల రూపాయల నుంచి 90 లక్షల రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ మానస్ కెరీర్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బిగ్ బాస్ మానస్ కు సోషల్ మీడియాలో సైతం క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతోంది.

మానస్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నారు. వివాదాలకు దూరంగా ఉండటం మానస్ కు మరింత కలిసొస్తుందని చెప్పాలి. మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలలో నటించారు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మానస్ హీరోగా కూడా సక్సెస్ సాధించడం ఖాయమని చెప్పవచ్చు. మానస్ పారితోషికం కూడా పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.

2023 సంవత్సరం బిగ్ బాస్ (Maanas) మానస్ కు ఊహించని స్థాయిలో కలిసొచ్చిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో తెలుగు తర్వాత సీజన్లు ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. తాజాగా పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus