Maanas: భార్యతో మానస్ బ్యూటిఫుల్ ఫోటోలు వైరల్.!

  • November 29, 2023 / 08:23 PM IST

‘బిగ్‌బాస్‌ 5 ‘ కంటెస్టెంట్‌, నటుడు మానస్‌, సీరియల్ హీరో అయిన మానస్ నాగులపల్లి అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘నరసింహనాయుడు’ ‘దేవుళ్ళు’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇతను నటించాడు. ‘బిగ్ బాస్ 5 ‘ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి కూల్ గా గేమ్ ఆడి బోలెడంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ‘బ్రహ్మముడి’ సీరియల్లో హీరోగా కూడా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.

ఇక మానస్ ఇటీవల పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన బ్యాచిలర్‌ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టాడు.పెద్దలు చూసిన అమ్మాయినే మానస్ పెళ్లి చేసుకున్నాడు.వారం రోజుల క్రితం అంటే నవంబర్ 22 , బుధవారం నాడు రాత్రి 8.55 గంటలకు శ్రీజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌ లో వీరి పెళ్లి జరిగింది. మానస్, శ్రీజ..ల తల్లిదండ్రులు, బంధుమిత్రులతో పాటు బుల్లితెర నటీనటులు, పలువురు సినీ సెలబ్రిటీలు కూడా మానస్ పెళ్లి వేడుకలో సందడి చేశారు.

ఆ తర్వాత రిసెప్షన్ లో  (Maanas) మానస్ తన భార్య శ్రీజతో కలిసి డాన్స్ చేసిన వీడియో అయితే ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది.అలాగే పెళ్లి తర్వాత మానస్ తన భార్య, స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలు, అలాగే భార్యతో పర్సనల్ గా తీసుకున్న రొమాంటిక్ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. లేట్ చేయకుండా వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus