Shanmukh: ఖరీదైన కారు కొన్న షణ్ముఖ జస్వంత్.. ధరెంతంటే?

యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ జస్వంత్ అనంతరం ఎన్నో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా యూట్యూబ్ వెబ్ సిరీస్ ల ద్వారా ఈయన వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ ద్వారా ఈయన మరింత పాపులర్ అయినప్పటికీ నెగిటివిటీ ద్వారా పాపులర్ సంపాదించారు. బిగ్ బాస్ హౌస్ లో సిరితో కలిసి ఈయన వ్యవహరించిన తీరుతో పెద్ద ఎత్తున నెగిటివిటీ మూటగట్టుకున్నారు.

బిగ్ బాస్ లో షణ్ముఖ్ వ్యవహరించిన తీరుతో ఏకంగా తన ప్రేమకు కూడా బ్రేక్ పడింది.అయితే ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి షణ్ముఖ్ తాజాగా దసరా పండుగ సందర్భంగా ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులతో కలిసి ఈయన హైదరాబాద్ షో రూమ్ లో ఖరీదైన బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ కి చెందిన కారును కొనుగోలు చేశారు.

ఈ కారు సుమారు 50 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కారుతో షణ్ముఖ్ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సంతోషకరమైన వార్తను తెలియజేస్తూ తనని ఈ స్థాయిలో చూడాలనుకున్నది కేవలం తన పేరెంట్స్ తన ఫాన్స్ అంటూ ఈయన చెప్పకొచ్చారు. మొత్తానికి తన డ్రీమ్ కారు కొనుగోలు చేశానని, ఈ కారు కొనడం తనకు ఇప్పటికీ ఓ కలగానే ఉందని,

ఎప్పుడైనా ఎవరికైనా లిఫ్ట్ అవసరమైతే అడగండి తప్పకుండా ఇస్తానంటూ ఈ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం షణ్ముఖ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus