Bigg Boss 7 Telugu: 8వ వారం బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ ఏంటి ? శివాజీ నోరు జారాడా?

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం నామినేషన్స్ లో శివాజీ బ్యాచ్ వర్సెస్ సీరియల్ బ్యాచ్ కి పెద్ద గొడవే అయ్యింది. శివాజీ భోలేకి వకాల్తా పుచ్చుకుని నామినేషన్స్ చేస్తే, ప్రశాంత్ శివాజీకి వకాల్తా పుచ్చుకుని నామినేషన్స్ చేశాడు. దీంతో సీిరియల్ బ్యాచ్ మొత్తం ఇద్దరిపైన విరుచుకుని పడ్డారు. దీని తర్వాత అర్జున్ తో శివాజీ మాట్లాడుతూ శోభా, ప్రియాంక ఇద్దరూ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. చూస్తున్నాను తొక్కేస్తా అంటూ నోరుజారాడు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాలా క్లియర్ గా శివాజీ తొక్కేస్తా అంటూ మాట్లాడాడు. అంతేకాదు, నైట్ ముచ్చట్లు పెడుతూ భోలే కి క్లాస్ పీకాడు. మద్యలో అర్జున్ వస్తే టాపిక్ ఆపేయమని భోలేకి చెప్పాడు. ఇక అర్జున్ కూడా ఈసారి శివాజీ మిస్ అయ్యాడని డిస్కషన్స్ పెట్టాడు. గౌతమ్ మాట్లాడుతూ ఈ సందీప్ ఎన్నిసార్లు చెప్పినా ఫౌల్ గేమ్ ఆడతాడు అందుకే శివాజీకి పాయింట్స్ వస్తున్నాయ్ అంటూ మాట్లాడాడు. ఇక నామినేషన్స్ తర్వాత బిగ్ బాస్ ఇంట్లో కొన్ని పదాలు వాడకూడదు.

వాటిని కంట్రోల్ చేస్కోవాలి అంటూ పార్టిసిపెంట్స్ కి గడ్డి పెట్టాడు. నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ని అమర్ నా కొడకా అన్నాడు, అలాగే సందీప్ బొంగు అంటూ మాట్లాడాడు. దీంతో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక నామినేషన్స్ తర్వాత ఈవారం కెప్టెన్సీ పోటీదారుల కోసం టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా “సింక్ ఆర్ ఫ్లోట్” అనే టాస్క్ ఇచ్చాడు.

ఈ టాస్క్ లో ఫస్ట్ ప్రియాంక, అమర్, శోభా, ఇంకా తేజ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడే చాలా ఫన్నీగా ఈ టాస్క్ గడిచింది. ఇందులో ప్రిియాంక విజయం సాధించి మొదటి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచింది. ఇక తర్వాత టాస్క్ లలో కూడా మిగతా వాళ్లు పార్టిసిపేట్ చేయబోతున్నారు. (Bigg Boss 7 Telugu) ఈ టాస్క్ లలో ఎవరు ఓడిపోతారో వాళ్లు కెప్టెన్సీ పోటీదారుల రేస్ నుంచీ తొలగిపోతారు. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus