Keerthi bhat: హీరో విజయ్ కార్తీక్ ను పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర నటి కీర్తి భట్!

బుల్లితెర సీరియల్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన నటి కీర్తి భట్ గురించి పరిచయం అవసరం లేదు. ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని చివరి వరకు హౌస్ లో కొనసాగుతూ అందరిని సందడి చేశారు. ఈ విధంగా బుల్లితెర నటిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె వరుస సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో విషాదం ఉందని చెప్పాలి.

ఈమె (Keerthi bhat) కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించి తాను ఒక్కటే మిగిలిన సంగతి గత పలు సందర్భాలలో ఈమె తెలియజేశారు. ఇలా తాను ఒకటే మిగలడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డానని గతంలో తన బాధను మొత్తం బయట పెట్టుకున్నారు. అంతేకాకుండా తాను ఈ ప్రమాదంలో తల్లిని అయ్యే భాగ్యాన్ని కూడా కోల్పోయానని తెలియజేశారు. ఇలా పెళ్లి చేసుకున్న తల్లి కాలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈమెను నటుడు విజయ్ కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నారు.

ఈ క్రమంలోనే ఒక బుల్లితెర కార్యక్రమంలో భాగంగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలోనే బుల్లితెర కార్యక్రమంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకొని అందరి సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కీర్తి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.నేను నీకు తోడుగా ఉంటాను నీకు సపోర్ట్ చేస్తాను మీ పేరెంట్స్ ను నా పేరెంట్స్ గా భావిస్తాను కానీ నన్ను మాత్రం వదలకుండా చూసుకో అంటూ ఎమోషనల్ అయ్యారు.

అలాగే ఈ వేదికపై తన అత్తమామలు కూడా ఉండడంతో వారి గురించి కూడా చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నేను వారి వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనని తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకున్నారని, మనకు పాప ఎందుకు నువ్వే మాకు పాపవి అవసరమైతే దత్తత తీసుకుందామని చెప్పారంటూ ఈ సందర్భంగా ఈమె తన అత్తమామల గురించి కూడా చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus