టిక్ టాక్ వీడియోలు అనంతరం యూట్యూబ్ షాట్ ఫిలిమ్స్, వీడియోస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు మెహబూబ్ దిల్సే. ఇలా యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయనకు అనంతరం బిగ్ బాస్ అవకాశం వచ్చింది ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస సినిమా అవకాశాలను అలాగే బుల్లితెర అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నటువంటి ఈయన తన సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకున్నారు.
అలాగే సొంత కారును కూడా కొనుగోలు చేశారు. ఇలా కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నటువంటి మెహబూబ్ ఇంట తాజాగా పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. మెహబూబా తమ్ముడు సుభాన్ షేక్ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది దీంతో తన తమ్ముడు పెళ్లి కొడుకుగా ముస్తాబయి వారితో కలిసి దిగిన ఫోటోలను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఫోటోలలో తన తమ్ముడితోపాటు మహబూబ్ తన తండ్రి ఫోటోలు దిగారు వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన మెహబూబ్ (Mehboob Dilse) నూతన దంపతులకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
నిఖా ముబారక్ మేరా బాయ్.. ప్రియమైన సోదరుడా నీ కలలు నిజం కావాలని ఆ అల్లా మిమ్మల్ని ఇద్దరినీ ఎల్లప్పుడూ ఇలాగే కలిసి ఉండేలా చూడాలని కోరుకుంటున్నాను. ఒకరికొకరు తోడుగా ఉంటూ ఎల్లప్పుడూ కలిసి ఉండండి. ఎప్పుడు సహనం ఓర్పుతో మెలగండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ తన తమ్ముడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో అందరూ తన తమ్ముడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.