Bigg Boss Telugu OTT: 3వ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ లో ఎవరున్నారంటే..?

బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం నామినేషన్స్ హీటెక్కాయి. ముమైత్ ఖాన్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తర్వాత సెకండ్ వీక్ శ్రీరాపక ఎలిమినేట్ అయ్యింది. వారియర్స్ నుంచీ ఒకరు, ఛాలెంజర్స్ నుంచీ ఒకరు ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఈసారి మూడోవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అందుకే, ఇప్పుడు ఈవారం నామినేషన్స్ అనేవి ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. అయితే, ఈసారి హౌస్ మేట్స్ లో కెప్టెన్ అనిల్ తప్ప మిగతా అందరూ నామినేషన్ లో ఉన్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Click Here To Watch Now

నిజానికి ప్రస్తుతం 15మంది హౌస్ మేట్స్ హౌస్ లో ఉన్నారు. వీరిలో కెప్టెన్ అనిల్ రాథోడ్ కాబట్టి ఎవరూ నామినేట్ చేయడానికి అవకాశం ఉండదు. అంతేకాదు, ఈసారి జూనియర్స్ , సీనియర్స్ అని తేడా లేకుండా నామినేషన్స్ జరినట్లుగానే తెలుస్తోంది. అయితే, ప్రోమోలో చూపించిన విధంగా చూస్తే మాత్రం తేజస్వి అరియానా ఒకరినొకరు నామినేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది కాబట్టి, ఒకొక్కరు ఇద్దరిని నామినేట్ చేయచ్చనేది అర్ధం అవుతోంది. నామినేషన్స్ లో యాంకర్ శివకి, నటరాజ్ మాస్టర్ కి, అనిల్ కి మహేష్ విట్టాకి, అలాగే మిత్రాశర్మాకి చైతూకి గట్టి ఫైట్ జరిగినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు, హీరోయిన్ బిందుమాధవి అఖిల్ కి ఛాలెంజ్ విసురుతోంది. నీ తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అంటూ క్లాస్ పీకుతోంది. ఇక మూడోవారం నామినేషన్స్ రసవత్తరంగా జరిగినట్లుగానే తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో ప్రోమోలో చూపించిన విధంగా చూసినట్లయితే, ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చినవారు కూడా ఉన్నారు. అజయ్, స్రవంతి, బిందుమాధవి, తేజస్వి ఈనలుగురు ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చారా అని అనిపిస్తోంది.

ఇక సోషల్ మీడియాలో చెప్పిన విధంగా 14మంది నామినేట్ అయితే మాత్రం ఈసారి బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ షో ఒక రేంజ్ లో ఉండబోతోంది. మరి చూద్దాం.. నామినేషన్స్ లోకి ఎంతమంది వస్తారు అనేది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus