Bigg Boss Nominations: నామినేషన్స్ లో హైలెట్స్..! 9వ వారం వీళ్లకే డేంజర్..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో 9వ వారం నామినేషన్స్ తో హౌస్ హీటెక్కిపోయింది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ దిష్టిబొమ్మ పై కుండని పెట్టి దాన్ని హ్యామర్ తో పగలకొట్టి మరీ నామినేట్ చేసుకున్నారు. ఇక్కడే అరియానా, మిత్రా కుండలని కొట్టే పద్దతి చూస్తుంటే వారి కోపం ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. రీసంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో చూస్తుంటే అరియానాకి , మిత్రాకి , నటరాజ్ మాస్టర్ కి శివకి గట్టిగానే పడినట్లుగా కనిపిస్తోంది. అలాగే, ఈసారి హమీదా కూడా చాలా లాజిక్స్ మాట్లాడుతూ నామినేట్ చేస్తోంది.

Click Here To Watch NOW

నామినేషన్స్ లో హౌస్ మేట్స్ తమ యాటిట్యూడ్ ని క్లియర్ గా చూపించారు. లాస్ట్ వీక్ అజయ్ ఎలిమినేట్ అయిపోవడం వల్ల హౌస్ లో ఎవరైనా ఎప్పుడైనా వెళ్లిపోవచ్చని డిసైడ్ అయ్యారు. ఈసారి 9వారాలు గడుస్తున్నా కూడా ఏ ఇద్దరి మద్యలో లవ్ ట్రాక్ నడవడం కానీ, అలాగే ప్రత్యేకమైన ఎఫెక్షన్ – బాండింగ్ ఉండటం కానీ జరగలేదు. ఈసారి ఫ్రెండ్షిప్ ని బాగా డెవలప్ చేద్దామని అనుకున్నా కూడా అది కూడా అజయ్ ఎలిమినేషన్ తో అయిపోయింది.

ఇక టాస్క్ లలో కూడా ఎవరి ఇండివెడ్యువల్ గేమ్ వాళ్లు ఆడుతూ ఎవరికి వారే సోలో ఫైటర్స్ అనే బిల్డప్ ఇస్తున్నారు. అందుకే, నామినేషన్స్ లో రీజన్స్ చాలా లాజికల్ గా ఉండేలా చూస్కుంటున్నారు. ఇక్కడే ఈవారం ఇంటి కెప్టెన్ అఖిల్ కాబట్టి ఎవ్వరూ నామినేట్ చేయలేకపోయారు. బిగ్ బాస్ హౌస్ లో రానున్న వారాలు హౌస్ మేట్స్ అందరికీ చాలా టఫ్ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం ఈవారం 7గురు నామినేషన్స్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇందులో అఖిల్ కెప్టెన్ కాబట్టి ఇంట్లో ఎవ్వరూ నామినేట్ చేయలేదు. అలాగే అషూరెడ్డిని ఇంకా బిందుమాధవిని కూడా నామినేట్ చేయలేదు. మిగతా ఏడుగురు ఎవరైతే ఉన్నారో వాళ్లు నామినేట్ అయ్యారు. బాబాభాస్కర్, హమీదా, అరియానా, మిత్రాశర్మా, నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ, ఇంకా అనిల్ రాధోడ్ లు నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. గతవారంతో పోలిస్తే ఈవారం బిందుమాధవి సేఫ్ జోన్ లో ఉండటం విశేషం. లాస్ట్ వీక్ బాబాభాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిందుమాధవిని సేఫ్ చేశాడ.

అలాగే, కెప్టెన్ శివ కాబట్టి ఆవారం నామినేషన్స్ లోకి రాలేదు. వీరిద్దరూ లేకపోవడంతో మిగతా హౌస్ మేట్స్ తమ ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకున్నారు. ఇక ఇప్పుడు నామినేషన్స్ లో ఏకంగా ఏడుగురు ఉంటడం విశేషం. ఈసారి హౌస్ మేట్ దిష్టి బొమ్మపై కుండని పెట్టి దాన్ని పగలగొట్టి మరీ నామినేట్ చేశారు. నటరాజ్ మాస్టర్ దగ్గర కుండని పగలకొట్టిన అరియానా సాలిడ్ పాయింట్ చెప్పి తనెంత స్ట్రాంగ్ కంటెస్టంటో మరోసారి నిరూపించింది. మొత్తానికి అదీ విషయం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus