Bigg Boss: బ్రీఫ్ కేస్ ఎవరు తీసుకున్నారు..? ఈ ముగ్గురు ఎలిమినేషన్..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ – 1 ముగింపుకి వచ్చేసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిపోయింది. ఈ నేపథ్యంలో మొదటిరోజు షూటింగ్ లో ముగ్గుర్ని ఎలిమినేట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇందులో ఫస్ట్ బాబాభాస్కర్ హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత అనిల్ రాథోడ్ కూడా హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిపోయాడు. మిత్రా శర్మా కూడా ఎలిమినేట్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు ప్రస్తుతానికి ఎలిమినేట్ అయిపోయారని, సీక్రెట్ రూమ్ లో ఉన్నారని టాక్. ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అప్పుడు బయటకి రివీల్ చేసే అవకాశం ఉంది.

ఇక హౌస్ లో మిగిలింది నలుగురే. ఈ నలుగురిలోనే బిగ్ బాస్ టైటిల్ పోరు అనేది ఉంటుంది. అయితే, అరియానా, యాంకర్ శివ ఇద్దరూ కూడా అన్ అఫీషియల్ పోలింగ్ లో వెనకబడి ఉన్నారు. కాబట్టి బిందు ఇంకా అఖిల్ మద్యలోనే అసలు పోరు ఉంటుంది. వీళ్లిద్దరిలోనే విన్నర్ డిసైడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇంకా విన్నర్ షూటింగ్ అనేది జరగలేదు. శుక్రవారం సాయంత్రం, లేదా శనివారం రోజున ఈ ఎపిసోడ్ షూటింగ్ చేసే అవకాశం ఉంది. నిజానికి మిత్రా శర్మా థర్డ్ పొజీషన్ లేదా ఫోర్త్ పొజీషన్ లో ఉంటుందని అందరూ అనుకున్నారు.

కానీ, అరియానా , యాంకర్ శివ వీళ్లిద్దరూ టైటిల్ ఫేవరెట్స్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక్కడే హౌస్ లోకి బ్రీఫ్ కేస్ 10 లక్షలు పంపినట్లుగా సమాచారం. మరి దీన్ని ఎవరు తీస్కున్నారు. ఎవరు తీసుకుని బయటకి వచ్చారు అనేది ఆసక్తికరం. ఒకవేళ అరియానా లేదా శివ ఇద్దరిలో ఎవరు దీన్ని తీసుకుంటారు అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే, హౌస్ లో జెర్నీలు చూసిన తర్వాత అందరికీ ఒక ఎలివేషన్ అనేది వచ్చింది. శివ జెర్నీ చూస్తుంటే శివకి విన్నర్ అయ్యే క్వాలిటీలు అన్నీ ఉన్నాయని భావించాడు శివ.

అలాగే అరియానా జెర్నీ కూడా తనకి విన్నింగ్ క్వాలిటీ ఉండేలాగానే అనిపించింది. అందుకే, ఇద్దరూ బ్రీఫ్ కేస్ తీస్కునే ఛాన్స్ అయితే లేదు. బిందు జెర్నీ చూసిన తర్వాత బాగా ఎమోషనల్ అయ్యింది. బిందుకి ఖచ్చితంగా తను విన్నర్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ తోనే ఉంది. కాబట్టి బిందు కూడా బ్రీఫ్ కేస్ తీస్కోదు. అఖిల్ అయితే కేవలం టైటిల్ కోసం వచ్చాడు కాబట్టి 20 లక్షలు ఇచ్చినా తీస్కోడు. సో, ఇప్పుడున్న ఆర్డర్ ప్రకారమే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది.

అరియానా నాలుగో పొజీషన్ లో శివ మూడో పొజీషన్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో బిందు విన్నర్ అయ్యిందంటూ స్పెషల్ ఫోటోలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. కానీ, అన్నీ ఫ్యాన్స్ కావాలని మార్ఫింగ్ చేసిన ఫోటోలు. అంతేకాదు, ఇప్పటి వరకూ షూటింగ్ జరగనిదే విన్నర్ డిసైడ్ ఎలా అవుతారు అంటూ అఖిల్ ఫ్యాన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి చూద్దాం ఈసారి సీజన్ లో లేడీ విన్నర్ అవుతుందా లేదా అనేది. అదీ విషయం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus