Bindhu Madhavi: అతనితో ఆ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేనిది.. బిందు మాధవి కామెంట్స్ వైరల్!

బుల్లితెర మీద ప్రసారమైన అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారం అవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తిచేసుకుంది. ఇక ఇటీవల ఓటిటిలో బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో కూడా ప్రసారం అయింది. ఈ నాన్ స్టాప్ సీజన్ లో బిందు మాధవి కూడా పాల్గొంది. ఆవకాయ్ బిర్యానీ సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బిందు మాధవి ఆ తర్వాత నాని హీరోగా నటించిన పిల్ల జమిందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది.

ఇక ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు తమిళ ఇండస్ట్రీకి తన మఖాం మార్చేసింది. ఇలా తమిళ సినిమాలలో నటిస్తూ అక్కడ టీవీ షోలో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఓటీటి లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకుంది.

ఈ షో ప్రారంభమైన నాటి నుండి చివరివరకు బిందు మాధవి టైటిల్ కోసం చాలా కష్టపడి చివరికి విజయం సొంతం చేసుకుంది అఖిల్ కి గట్టి పోటీ ఇస్తూ ఆడపులి అని మంచి గుర్తింపు పొందింది. ఇక ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బిందు మాధవి తన చిన్ననాటి ప్రేమ గురించి బయట పెట్టింది. చిన్నతనంలో బిందు మాధవి తన తండ్రితో కలిసి షటిల్ ఆడటానికి వెళ్ళినప్పుడు రోజు ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి తనకోసం స్కూటీ మీద ఒక గిఫ్ట్ పెట్టేవాడని ఈ సందర్భంగా తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు.

ఇలా చాలా రోజుల తర్వాత అతనిని కలుసుకున్నానని,ఆ వ్యక్తి వల్లే తనకి ఇండిపెండెంట్ గా జీవించే ధైర్యం వచ్చిందని కూడా బిందు మాధవి వెల్లడించింది. అయితే అతనితో అన్ని అనుభవాలు కలిగాయని, వాటిని ఎప్పటికి మర్చిపోలేనని వెల్లడించింది. అయితే అందరిలాగే తన ఫస్ట్ లవ్ కూడా బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ టైటిల్ దక్కించుకున్న బిందు మాధవి ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus