Bigg Boss: స్టార్ హీరోయిన్ కు బిగ్ బాస్ షో ​ఛాన్స్ దక్కిందా..?

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ షో హిందీ, తెలుగు భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కానుండగా సీజన్ 5లో వీళ్లే పాల్గొనబోతున్నారంటూ కొంతమంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్4 కంటెస్టెంట్ల విషయంలో విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 5 కంటెస్టెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 5లో స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పాల్గొనబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లు బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు పాయల్ రాజ్ పుత్ కు భారీ మొత్తంలో పారితోషికం ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. పాయల్ నిజంగా బిగ్ బాస్ షోలో పాల్గొంటారో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

ఆర్.ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ లో గుర్తింపును సంపాదించుకున్న పాయల్ కు ఆ సినిమా తరువాత నటించిన సినిమాలేవీ సక్సెస్ సాధించలేదు. అయితే పాయల్ ను బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పాయల్ బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి ఓకే చెబితే మాత్రం గతంలో ఏ కంటెస్టెంట్ కు దక్కని స్థాయిలో పాయల్ కు రెమ్యునరేషన్ దక్కనుందని తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus