Bigg Boss Telugu 6: హౌస్ మేట్స్ తో ఆడుకున్న బిగ్ బాస్..! అసలు మేటర్ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో బర్త్ డే టాస్క్ మొదలైంది. బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా హౌస్ మేట్స్ బిగ్ బాస్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఎవరు బాగా ఎంటర్ టైన్ చేస్తారో వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఓవర్ యాక్షన్ మొదలుపెట్టారు. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ని టీజ్ చేస్తూ జోకులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా కన్ఫెషన్ రూమ్ కి వచ్చిన గీతు ఓవర్ యాక్షన్ చేసింది. బిగ్ బాస్ చికెన్ తినాలంటే ఇంట్లో ఏదైనా గాసిప్ చెప్పాలని ఆదేశించాడు.

దీంతో గీతు రకరకాల గాసిప్స్ చెప్పింది. ఇక్కడే ఆర్జే సూర్యకి, ఇనయకి మద్యలో ఏదో ఉందని మొదలుపెట్టింది. ఆర్జే సూర్య వైపు నుంచీ ఏమీ లేదు కానీ, ఇనయ వైపు నుంచీ ఏదో ఉందంటూ మాట్లాడింది. అలాగే, బాలాదిత్య సుదీపని దీపు దీపు అంటుంటే మండుతోందని చెప్పింది. దీంతో బిగ్ బాస్ జోకులు వేస్తూ గీతుని టీజ్ చేశాడు. ఇక్కడే గీతు సీరియస్ గా బయటకి వచ్చి హౌస్ మేట్స్ తో వీడియోలు చూపించారని అబద్దం చెప్పింది. ఇంతసేపు కన్ఫెషన్ రూమ్ లో ఏం చూపించారు అంటే రెండు మూడు వీడియోలు చూపించారని చెప్పింది.

దీంతో హౌస్ మేట్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. గీతు ఓవర్ యాక్షన్ తో హౌస్ మేట్స్ ని నమ్మించింది. ఇంటి సభ్యులు రకరకాలుగా ఎంటర్ టైన్ చేశారు. అయితే, బిగ్ బాస్ కూడా హౌస్ మేట్స్ ని టీజ్ చేస్తూ ఒక ఆట ఆడుకున్నాడు. వాష్ రూమ్ కి వెళ్తున్న సుదీపని ఆపి మరీ తెలుగులో తొమ్మిదో ఎక్కం చెప్పమన్నాడు. అలాగే, ఇనయని సైతం ఆపి ఎంటర్ టైన్ చేయమన్నాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ ఎలాంటి యాక్టివిటీ చేయకుండా ఉన్నప్పుడు బిగ్ బాస్ నిద్రపోయాడు. మీ చర్యల వల్ల విసుగు వస్తోందని, అందుకే నిద్రపోతున్నా అని చెప్పాడు.

అంతేకాదు, బిగ్ బాస్ కి నిద్రాభంగం కలిగిస్తే శిక్ష వేస్తానని అన్నాడు. దానికోసం ఒక స్టీల్ పళ్లెం, కప్పు తలమీద పెట్టుకుని గార్డెన్ ఏరియాలో తిరుగుతూ ఉండాలని చెప్పాడు. మిగతా హౌస్ మేట్స్ వాళ్లని డిస్టర్బ్ చేశారు. ఇక్కడ గీతు చేసిన పనికి ఫైమా పళ్లెం కిందపడిపోయింది. దీంతో కోపం వచ్చిన బిగ్ బాస్ ఫైమాని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. ఫైమాకి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఫైమా కూడా బయటకి వచ్చి వీడియోలు చూపించారని, ఆటలో ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ కాసేపు అప్సెట్ అయ్యింది.

ఫైమా ని చూసిన మిగతా హౌస్ మేట్స్ తన గురించి ఏం మాట్లాడామో గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు. ఇనయ, ఆర్జే సూర్య ఇద్దరూ ఎలాంటి మాటలు మాట్లాడలేదని చెప్పారు. ఇక సీక్రెట్ టాస్క్ లో భాగంగా ఫైమా రాత్రి మూడుసార్లు అందరికీ నిద్రాభంగం చేయాలని చెప్పాడు బిగ్ బాస్. మరి ఈ టాస్క్ లో ఫైమా గెలిచిందా లేదా అనేది తెలియాలి. అదీ మేటర్.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus