Akhil Sarthak: ప్రశాంత్ విన్నర్ అయితే అంతకన్నా సంతోషం లేదు!

బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా కంటెస్టెంట్గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అనంతరం రన్నర్ గా నిలిచినటువంటి వారిలో అఖిల్ సార్థక్ ఒకరు. ఈయన సీజన్ ఫోర్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా ఓటీటీలో బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అక్కడ కూడా అఖిల్ రన్నర్ గానే నిలిచారు. ఇలా రెండుసార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన రన్నర్ గా నిలవడం గమనార్హం. ఇక ఈ కార్యక్రమం తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే సినిమాలలోను నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి అఖిల్ ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా పల్లవి ప్రశాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మొదటి నుంచి ఈయనని హౌస్ మేట్స్ అందరూ కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు. దీంతో పల్లవి ప్రశాంత్ కి అఖిల్ సార్థక్ తన మద్దతు తెలియజేస్తున్నారు. ఇక హౌస్లో కూడా రైతుబిడ్డ ఎంతో అద్భుతంగా ఆడుతూ సెలబ్రిటీలకు గట్టి పోటీనే ఇస్తున్నారు. ఇక సెలబ్రెటీలు కూడా సాధించలేనటువంటి పవర్ ఆస్త్రాన్ని కూడా గెలుపొందారు. దీంతో అఖిల్ (Akhil Sarthak) ఆయనని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈయన ప్రశాంత్ కి సపోర్ట్ చేయడంతో పలువురు ఈయనను సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు అతనికి సపోర్ట్ చేస్తుంటే ఆయన కూడా రన్నర్ గానే నిలుస్తారా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 కి సంబంధించిన కొన్ని ప్రోమోలను వైరల్ చేస్తూ అఖిల్ పై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా తన గురించి ట్రోల్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అఖిల్ స్పందిస్తూ వారికి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఇలా ట్రోల్ చేస్తున్నందుకు ముందుగా అందరికీ థాంక్స్ చెప్పారు.

మీరే నన్ను ఇలా పాపులర్ చేస్తున్నారని ఈయన వెల్లడించారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ కి నేను సపోర్ట్ చేస్తుంటే చాలా మంది నీలాగే రన్నర్ గా నిలవాలా అని కోరుకుంటున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ రన్నర్గా నిలిస్తే నేను హ్యాపీగానే ఫీలవుతా అదే విన్నర్ గా నిలబడితే ఇంకా సంతోషిస్తాను అంటూ ఈయన తెలిపారు. అయినా రన్నర్ గా ఉండాలి అంటే కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. దమ్ముంటే ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఆడి చూడండి అంటూ ఈయన ట్రోలర్స్ కు తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus