ఎప్పుడెప్పుడు ‘బిగ్ బాస్4’ స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రతీ ఏడాది జూలై చివరి వారం లో ప్రారంభం అయ్యే ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఈ ఏడాది.. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఆలస్యంగా ప్రారంభం కాబోతుంది. ఇక ‘బిగ్ బాస్’ లాంచ్ అయ్యే డేట్ ఎప్పుడూ అనే విషయం పై కూడా ఇప్పటి వరకూ సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. చెప్పాలంటే.. ఆగష్టు 30నే ‘బిగ్ బాస్4’ ను మొదలు పెట్టాలి అనుకున్నారు నిర్వాహకులు.
కానీ ‘బిగ్ బాస్’ హౌస్ సెట్ ఇంకా రెడీ కాకపోవడం వల్ల లేట్ అవుతుందని సమాచారం. ఈ సీజన్ ను కూడా ‘కింగ్’ నాగార్జునే హోస్ట్ చెయ్యబోతున్నారు. ఇక సెప్టెంబర్ 6 నుండీ బిగ్ బాస్ మొదలు కాబోతుందట. హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయం పై రక రకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే అవేమీ కరెక్ట్ కాదని.. బిగ్ బాస్ యూనిట్ సభ్యుల సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్4 కు సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లు క్వారెంటైన్లో ఉన్నారట.
హోస్ట్ నాగార్జున వాళ్ళను హౌస్ లోపలి పంపే వరకూ వాళ్ళు అక్కడే ఉంటారని సమాచారం. ఈ సారి ‘బిగ్ బాస్’ 50 రోజుల నుండీ 75 రోజుల వరకే నిర్వహించబోతున్నారని టాక్ నడుస్తుంది. ఫిజికల్ టాస్క్ లు కూడా ఉండబోవు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇవన్నిటికీ సెప్టెంబర్ 6న క్లారిటీ రావొచ్చేమో చూద్దాం…!