Bigg Boss: త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 7… హోస్ట్ ఎవరో తెలుసా?

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం వివిధ భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం హిందీ తమిళ్ కన్నడ తెలుగు భాషలలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమయింది. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుందని వార్తలు వచ్చినప్పటికీ దీని గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఇలా సీజన్ (Bigg Boss) గురించి అప్డేట్ ఇవ్వకపోవడంతో బహుశా ఈ సీజన్ ఉండదేమో అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఊహించని విధంగా స్టార్ మా బిగ్ బాస్ సీజన్7 ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా సడన్ గా ఈ ప్రోమో విడుదల చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుందని తెలుస్తోంది.

ఇకపోతే గత సీజన్ మాదిరి కాకుండా ఈసారి మంచి పేరు ఫాలోయింగ్ ఉన్నటువంటి సెలబ్రిటీలను హౌస్ లోకి పంపించబోతున్నారు. ఇలా అయితేనే ఈ సీజన్స్ సక్సెస్ అవుతుందని లేకపోతే గత సీజన్ మాదిరిగా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదని తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ఎవరు వ్యవహరించనున్నారన్న విషయం కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ రెండవ సీజన్ కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం తదుపరి సీజన్స్ అన్నింటికీ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే ఈసారి నాగార్జున ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించరంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జున స్థానంలో మరొక టాలీవుడ్ స్టార్ హీరో ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించబోతున్నారంటూ వార్త వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ కార్యక్రమానికి సంబంధించి తరువాత అప్డేట్ లో ఈ విషయాన్ని తెలియజేయబోతున్నారని తెలుస్తుంది. బహుశా ఈ కార్యక్రమానికి రానా వ్యాఖ్యతగా ఉండబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus