Shobha Shetty: పెళ్లికి ముందే కొత్త ఇంటిని కొన్న శోభా శెట్టి?

కార్తీకదీపం సీరియల్ లో మోనిత పాత్రలో నటించి అందరికీ తనలో ఉన్నటువంటి విలన్ ను పరిచయం చేశారు నటి శోభా శెట్టి ఇలా ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న శోభ చివరి వరకు హౌస్ లో కొనసాగలేక 14వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఇక ఈమె హౌస్ నుంచి బయటకు రాగానే తన కెరియర్ పరంగా బిజీ అయ్యారు అయితే శోభ శెట్టి హౌస్ లో కొనసాగుతున్న సమయంలోనే తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే. గత మూడు సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు తెలియజేశారు. ఇక ఈమె బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు రావడంతో త్వరలోనే వీరిద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఇకపోతే ఈమె బుల్లితెర సీరియల్స్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా తన తల్లిదండ్రులు అలాగే తన ప్రియుడు యశ్వంత్ తో కలిసి ఈమె తన హోమ్ టూర్ వీడియోని చేశారు. ఈమె కొత్త ఇంటిని కొనుగోలు చేశారని ప్రస్తుతం ఈ ఇంటి పనులు ఇంకా పూర్తి కాలేదు అంటూ తన కొత్త ఇంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇందులో భాగంగా ఈమె (Shobha Shetty) లివింగ్ ఏరియా కిచెన్ అంటూ ప్రతి ఒక్క రూమ్ చూపించారు. అయితే ప్రస్తుతం కన్స్ట్రక్షన్ మాత్రమే పూర్తి అయిందని ఇంకా ఇంటీరియర్ డిజైన్ చేయాల్సి ఉందని తెలిపారు. ఇక ఆ ఇంటికి మొత్తం యశ్వంత్ ఇంటీరియర్ డిజైనర్ గా పని చేయబోతున్నారని ఆయన చెప్పిన విధంగానే డిజైన్ చేయిస్తున్నామని శోభ వెల్లడించారు అంతేకాకుండా ఈ ఇంటికి యశ్ శోభ నిలయం అని పేరు కూడా పెట్టినట్టు తెలిపారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus