Bigg Boss 7 Telugu: ఇమ్యూనిటీ వాళ్లకి కావాల్సిన వాళ్లకే ఇస్తున్నారా ? తెర వెనుక అసలు నిజాలు ఇవేనా..!

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం ఇమ్యూనిటీ టాస్క్ లో బిగ్ బాస్ పక్షపాతాన్ని చూపించాడా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. అసలు ఏం జరిగిందంటే, బిగ్ బాస్ మూడోవారం కావాలని కంటెండర్ షిప్ రేస్ లో ముగ్గురు పార్టిసిపెంట్స్ ని సెలక్ట్ చేశాడు. ఇందులో అమర్ దీప్, శోభాశెట్టి , ఇంకా ప్రిన్స్ ఉన్నారు. వీరిని ఛాలెంజ్ చేస్తూ మిగతా హౌస్ మేట్స్ వాళ్లని నామినేట్ చేశారు. ఇక్కడే ఒక్కొక్కరికి ఒక్కో ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫస్ట్ ప్రిన్స్ కి స్టాండ్ పైన గెడ్డం ఆనించి 45 నిమిషాలు ఉండాలి. అయితే, ప్రిన్స్ ని ఛాలెంజ్ చేసిన వాళ్లు అన్ని విదాలుగా ప్రిన్స్ ని డిస్టర్బ్ చేయచ్చని చెప్పాడు.

కానీ, ప్రిన్స్ చాలా పట్టుదలగా ఆడి ఈ టాస్క్ లో విజయం సాధించి మొదటి కంటెండర్ అయ్యాడు. ఆ తర్వాత అత్యంత కారంగా ఉన్న చికెన్ పీస్ లు తిన్న శోభాశెట్టి కూడా తనని ఛాలెంజ్ చేసిన వాళ్లని ఓడించి రెండో కంటెండర్ అయ్యింది. ఆ తర్వాత తన జుట్టుని శాక్రిఫైజ్ చేసి ప్రియాంక జైన్ అమర్ దీప్ పై గెలిచి మూడో కంటెండర్ అయ్యింది. అయితే, ఇక్కడే ముగ్గురికి పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఈ ముగ్గురూ ఉన్న బొమ్మలని తెప్పించి స్టాండ్ పై పెట్టి ఈ ముగ్గురిలో ఎవరైతే వీక్ అని మీరు అనుకుంటారో వారిని పోటీ నుంచీ తప్పించమని చెప్పాడు. అంతేకాదు, దానికి తగిన కారణాలు కూడా చెప్పమని చెప్పాడు బిగ్ బాస్.

శోభాశెట్టి వెంటనే ప్రిన్స్ అని డిసైడ్ చేసి చెప్పింది. శోభా శెట్టి ప్రిన్స్ చాలా స్ట్రాంగ్ కాబట్టి నెక్ట్స్ లెవల్లో నేను పోటీ పడలేనని అందుకే, అమ్మాయిలు అమ్మాయిలు గేమ్ ఆడితే బాగుంటుందని కారణం చెప్పింది. దీంతో ప్రిన్స్ శోభాతో ఆర్గ్యూమెంట్ కి దిగాడు. ఇద్దరూ చాలా సేపు ఆర్గ్యూ చేస్కున్నారు. అయినా కూడా ప్రిన్స్ నే నామినేట్ చేసింది శోభా. ఇక్కడ ప్రియాంక ఓటు చాలా కీలకంగా మారింది. చాలా సేపు ఆలోచించిన తర్వాత ప్రియాంక ప్రిన్స్ ని పోటీ నుంచీ తప్పించింది. హౌస్ లో ఎగ్రెసివ్ బిహేవియర్ ఉండకూడదని, తను ఇచ్చే రియాక్షన్స్ నాకు నచ్చడం లేదని ఒక రీజన్ చెప్పింది.

దీంతో ప్రిన్స్ కి చాలా కోపం వచ్చింది. ఎలాంటి పనులు చేస్తున్నాను నేను, ఎవరికి హాని తలపెట్టాను చెప్పు అంటూ ప్రియంక మీదకు వెళ్లాడు. దీంతో ప్రియాంక ఇదే ఇదే నచ్చడం లేదని క్లియర్ గా చెప్పింది. అంతేకాదు, అక్కడ తన యాటిట్యూడ్ ని కూడా చూపించింది. బిగ్ బాస్ కూడా ఇది ముందే ఊహించాడు. శోభాశెట్టి ఇంకా ప్రియాంక ఇద్దరూ కూడా కలిసి ప్రిన్స్ ని తప్పించేశారు. అలాగే, ప్రియాంక లాస్ట్ వీక్ ప్రిన్స్ యావార్ ని నామినేట్ చేసింది. అప్పుడు కూడా ఇదే రీజన్ చెప్పింది. దీంతో ప్రిన్స్ బొమ్మని ఇద్దరూ కలిసి హ్యామర్ తో పగలగొట్టారు.

ఆ తర్వాత సందీప్ ఎక్స్ ప్లయిన్ చేస్తున్నా కూడా బరెస్ట్ అయిన ప్రిన్స్ తన బొమ్మని హ్యామర్ తో గట్టిగట్టిగా పగలకొట్టాడు. ఈ యాటిట్యూడ్ ని మరోసారి ప్రియాంక అందరికీ చెప్పింది. ఇక బిగ్ బాస్ టీమ్ కావాలనే ప్రిన్స్ ని ఆట నుంచీ తొలగించేలా ఈ టాస్క్ డిజైన్ చేశారని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, యంత్రపు ఎద్దు అంటూ ఆ తర్వాత పెట్టిన టాస్క్ కూడా హౌస్ మోట్స్ కి ఫేవర్ గా ఉందని, ఇందులో బిగ్ బాస్ టీమ్ ఎవరినైనా గెలిపించుకునే వీలు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. మొత్తానికి తెర వెనుక స్టార్ మా సీరియల్స్ లో యాక్ట్ చేసేవారికి బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) టీమ్ ఫేవర్ చేస్తుందనే ఆడియన్స్ కి అనిపిస్తోంది . అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus