బిగ్‌బాస్‌ 4: పాపం మోనాల్‌… ఎంత ఏడ్చిందో.. ఎందుకంటే?

బిగ్‌బాస్‌ ఇంట్లో అభిజీత్‌ – మోనాల్‌ – అఖిల్‌ మధ్య ట్రయాంగిల్‌ స్టోరీ నడుస్తోందని అందరూ అనుకుంటున్నారు. బయట నెటిజన్లు, ఇంట్లో ఉంటున్న బిగ్‌బాస్‌ జనులు అదే అంటున్నారు. అయితే గత వారం ట్రాక్‌ వన్‌సైడ్‌ అయిపోయింది. అభిజీత్‌తో మోనాల్‌ మాట్లాడటం తగ్గించేసింది. మరోవైపు అఖిల్‌కు బాగా దగ్గరైంది. ఇప్పుడదే నామినేషన్‌ టైమ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

గతవారం స్టోర్‌ రూమ్‌ ఏరియాలో మోనాల్‌, అభిజీత్‌ కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ‘ఐ లైక్‌ యు’ అని అభిజీత్‌తో మోనాల్‌ అంది. ఆ విషయం తర్వాత బయటకు వేరేలా వచ్చింది. దీంతో ముగ్గురి మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. నామినేషన్‌లో భాగంగా అభిజీత్‌.. అఖిల్‌ను నామినేట్‌ చేశాడు. దీంతో చర్చలో అఖిల్‌ మోనాల్‌ టాపిక్‌ రైజ్‌ చేశాడు. అది మేం, మేం చూసుకుంటాం… నీకెందుకు అని అభిజీత్‌ అన్నాడు. ఓ అమ్మాయి గురించి కెమెరాల ముందు అలా ఎందుకన్నావ్‌ అంటూ అఖిల్‌ అన్నాడు.

అప్పటివరకు కామ్‌గా ఉన్న మోనాల్‌ ఒక్కసారి బరస్ట్‌అవుట్‌ అయిపోయింది. పెద్దగా ఏడుస్తూ తన బాధను చెప్పుకొంది. ఇంకా చెప్పాలంటే చెబుతూ అరిచింది. ‘మీకు మీకు సమస్యలుంటే మీరు మాట్లాడుకోండి. మీ చర్చలో నా పేరు తీసుకురావొద్దు’ అంటూ తెగేసి చెప్పింది. నేషనల్‌ టెలివిజన్‌లో ఇలా నా పేరు లాగి నా పరువు తీయకండి అంటూ ఏడుస్తూ వేడుకుంది. ఇక్కడ రెప్యుటేషన్‌ అనేది కీలకం. దానిని దెబ్బతీయకండి అంటూ అర్థించింది. చూద్దాం ఇప్పటికైనా అఖిల్‌ ఇలాంటి టాపిక్‌ ఎత్తకుండా ఉంటాడేమో.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus