Bigg Boss Telugu 6: బిగ్ బాస్ షో తెలుగు అన్ని సీజన్ల ఫినాలే రేటింగ్స్ వివరాలివే!

బుల్లితెర రియాలిటీ షోలలో బెస్ట్ షోగా పాపులారిటీని సంపాదించుకున్న బిగ్ బాస్ షో తొలి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఆరో సీజన్ మాత్రం ప్రేక్షకులను ఊహించని స్థాయిలో నిరాశపరిచింది. కంటెస్టెంట్ల ఎంపికలో లోపంతో పాటు పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడం కూడా ఈ షో రేటింగ్స్ తగ్గడానికి ప్రధాన కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. హోస్ట్ నాగార్జున కొంతమంది కంటెస్టెంట్లకు సపోర్ట్ గా మాట్లాడటం కూడా ఫ్యాన్స్ కు చిరాకు తెప్పించింది.

అయితే బిగ్ బాస్ షో సీజన్6 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రేటింగ్ కేవలం 8.07 కావడంతో షాకవ్వడం బిగ్ బాస్ ఫ్యాన్స్ వంతమవుతోంది. గత సీజన్లతో పోల్చి చూస్తే ఈ సీజన్ సగం రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షో సీజన్1 తెలుగు ఫినాలే ఎపిసోడ్ కు 14.13 రేటింగ్ వచ్చింది. సీజన్1కు తారక్ హోస్ట్ గా వ్యవహరించగా తన హోస్టింగ్ తో తారక్ ఎంతగానో ఆకట్టుకున్నారు.

బిగ్ బాస్ షో సీజన్2 కు నాని హోస్ట్ గా వ్యవహరించగా ఈ షో ఫినాలే ఎపిసోడ్ కు 15.05 రేటింగ్ వచ్చింది. ఈ షో ఫినాలే ఎపిసోడ్ కు వెంకటేశ్ గెస్ట్ గా హాజరయ్యారు. బిగ్ బాస్ షో సీజన్3 నుంచి బిగ్ బాస్ షో సీజన్6 వరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్3, బిగ్ బాస్4 ఫినాలే ఎపిసోడ్లకు చిరంజీవి గెస్ట్ గా హాజరు కాగా ఈ ఎపిసోడ్లకు ఏకంగా 18.29, 21.07 రేటింగ్స్ వచ్చాయి.

బిగ్ బాస్ షో సీజన్5 ఫినాలే ఎపిసోడ్ కు 18.4 రేటింగ్ వచ్చింది. బిగ్ బాస్ షోపై గతంతో పోల్చి చూస్తే ఆసక్తి తగ్గిందని అందుకు బిగ్ బాస్ సీజన్6 రేటింగ్ సాక్ష్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి. బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ ఆరు సీజన్లలో మేల్ కంటెస్టెంట్లు విజేతలుగా నిలిచారు. బిగ్ బాస్ షో సీజన్7 వద్దని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్7 కు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus