Bigg Boss Telugu 6: బిగ్ బాస్ టీమ్ పై కామెంట్స్..! తెర వెనుక ఏం జరుగుతోందంటే.?

బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 చివరికి వచ్చేసరికి విజేత ఎవరు అనేది ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సమయంలో కావాలనే సోషల్ మీడియాలో చాలామంది బిగ్ బాస్ టీమ్ పై విరుచుకుపడుతున్నారు. ముందుగానే మీరు విన్నర్ ని ఫిక్స్ అయ్యి , అతనికి ఫేవర్ గా మాట్లాడారని, అతనికి ఫేవర్ గా అన్ని గేమ్స్ డిజైన్ చేశారని చెప్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఈసారి అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఇదే కారణమని కామెంట్స్ చేస్తున్నారు. అసలు మేటర్లోకి వెళితే., బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఈసారి మొత్తం 21మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు.

ఫస్ట్ వీక్ నుంచే రేవంత్ ని హైలెట్ చేస్తూ, రేవంత్ మాట్లాడిన ప్రోమోలో కట్ చేస్తూ బిగ్ బాస్ టీమ్ రేవంత్ కి ఫేవర్ గా కనిపించింది. అతని కోపాన్ని, ఎగ్రెసివ్ నెస్ ని, మాట్లాడిన మాటలన్నీ హైలెట్ చేస్తూ చూపించారు. వేరేవాళ్లని అతను కామెంట్స్ చేసినవి, వెకిలిగా మాట్లాడినవి, తిట్టినవి, బూతులు మాట్లాడినవి మాత్రం చూపించలేదట. ఇప్పుడు దీనిని హైలెట్ చేస్తున్నారు బిగ్ బాస్ లవర్స్. ఎందుకంటే, ఫినాలే మరోవారం మాత్రమే ఉంది. ప్రస్తుతం అన్ అఫీషియల్ పోలింగ్స్ లో రేవంత్ టాప్ లో ఉన్నాడు. కాబట్టి అతనే విన్నర్ అవుతాడని చాలామంది రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

ఫస్ట్ నుంచీ కూడ బిగ్ బాస్ టీమ్ రేవంత్ కి ఫేవర్ గా ఉందని, సోషల్ మీడియాలో కూడా చాలామంది కావాలనే పాజిటివ్ గానే కామెంట్స్ చేస్తున్నారని చెప్తున్నారు. ప్రతి టాస్క్ లో అతను వేరేవాళ్లని అన్న విషయాలని టెలికాస్ట్ చేయలేదని, శ్రీహాన్ ని , నేహాని, ఫైమాని, శ్రీసత్యని, ఇలా అందర్నీ ఏడిపించినవి, టీజ్ చేసినవి ఎక్కడా కూడా టెలికాస్ట్ చేయలేదని అభిప్రాయ పడుతున్నారు. రేవంత్ బ్యాడ్ అయ్యే విషయాలు కానీ, ఆర్గ్యూమెంట్స్ కానీ టెలికాస్ట్ చేయకుండా కావాలనే బిగ్ బాస్ టీమ్ అతడ్ని హైలెట్ చేసిందనే కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అందుకే, ఈసీజన్ లో అతనే విన్నర్ అవుతాడని, వేరేవాళ్లకి ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా రేవంత్ నే విన్నర్ గా ప్రకటిస్తారని బిగ్ బాస్ ఫ్యాన్స్ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాన్యుడిగా వచ్చిన ఆదిరెడ్డి రేవంత్ అన్నమాటలని అతని ఉద్దశ్యాన్ని ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీస్తున్నారు. ఈవారం శనివారం నాగార్జున ఎపిసోడ్ లో వీడియో చూపించినపుడు అది ఎందుకు ఆడియన్స్ కి మ్యూట్ లో ఉంచారని, మొత్తం చూపించాల్సిందని అన్నారు. దీనిని బట్టీ చూస్తుంటే తెరవెనుక విన్నర్ ని డిసైడ్ చేసే ప్రక్రియ జరుగుతోందని అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు, రేవంత్ విషయంలో నెగిటివ్ గా ఏదైనా కామెంట్స్ చేస్తున్నా, హౌస్ మేట్స్ డిస్కస్ చేస్తున్నా కూడా వాటిని టెలికాస్ట్ చేయడం లేదని వాపోతున్నారు. మొత్తానికి విన్నర్ ని ఈసారి బిగ్ బాస్ టీమ్ ముందుగానే డిసైడ్ చేసి వచ్చారని, అందుకే ఇలా వాళ్లకి అనుగుణంగా ఉండే పాజిటివ్ అంశాలు మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏది ఏమైనా రేవంత్ గేమ్ పరంగా, టాస్క్ పరంగా బాగా ఆడాడు అని, అతను టైటిల్ పొందేందుకు అర్హుడు అని మరోవైపు రేవంత్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అదీమేటర్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus