Bigg Boss Telugu OTT: మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవ్వబోతోందా..? ఈవారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే..!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అనేవి ఎంత హాట్ హాట్ గా జరుగుతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందులో భాగంగా నాన్ స్టాప్ బిగ్ బాస్ హౌస్ లో జూనియర్స్ కి సీనియర్స్ కి పెద్ద వార్ జరుగుతోంది. జూనియర్స్ ని ఛాలెంజర్స్ గా బిగ్ బాస్ సీనియర్స్ అయిన వారియర్స్ లో ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో ట్యాగ్ ఇస్తూ సీనియర్స్ ని నామినేట్ చేశారు.

ఫస్ట్ యాంకర్ శివ సరయు ని ఇంకా ముమైత్ ఖాన్ ని నామినేట్ చేశాడు. ఇద్దరికీ అగ్రెసివ్ అంటూ ట్యాగ్ ఇచ్చాడు. మిత్రా శర్మ అరియానాకి బాండింగ్ కుదరట్లేదని అస్సలు కనెక్ట్ అవ్వట్లేదని చెప్తూ నామినేట్ చేసింది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ చాలా పార్షియాలిటీ చూపిస్తున్నారని చెప్పింది. వీరిద్దరనీ నామినేట్ చేసింది. తర్వాత ఆర్జే చైతూ హమీదాని నామినేట్ చేశాడు. అమె నుంచీ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని చెప్పాడు.

ఇక నటరాజ్ మాస్టర్ ని కూడా నామినేట్ చేస్తూ బాడీ షేమింగ్ చేయడం నాకు నచ్చలేదని చెప్పాడు. దీంతో నటరాజ్ మాస్టర్ కి ఆర్జే చైతూకి కాసేపు హీటెడ్ ఆర్గ్యూమెంట్ జరిగింది. తర్వాత శ్రీరాపక అరియానాని నామినేట్ చేసింది. డ్రామా క్వీన్ అంటూ ట్యాగ్ ఇచ్చింది. అలాగే ముమైత్ ఖాన్ ని సైతం నామినేట్ చేసింది. అజయ్ నటరాజ్ మాస్టర్ ని, అలాగే సరయు ని నామినేట్ చేశాడు. తర్వాత అనిల్ కూడా నటరాజ్ మాస్టర్ ని, ఇంకా సరయుని నామినేట్ చేస్తూ రీజన్స్ చెప్పాడు.

తర్వాత బిందుమాధవి అఖిల్ ని నామినేట్ చేసింది. తన వల్లే గేమ్ ఆగిపోతోందని చెప్పింది, ఇక్కడే వీరిద్దరికీ గట్టి ఆర్గ్యూమెంట్ అనేది జరిగింది. తర్వాత ముమైత్ ఖాన్ ని కూడా మేనేజర్ గా కరెక్ట్ లేదని చెప్పి బిందుమాధవి నామినేట్ చేసింది. ఆ తర్వాత స్రవంతి హమీదానీ, ఇంకా నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసింది. ఛాలెంజర్స్ అయిన జూనియర్స్ మొత్తానికి నటరాజ్ మాస్టర్ ని, ముమైత్ ఖాన్ ని, సరయుని టార్గెట్ చేసినట్లుగానే కనిపిస్తోంది.

వీళ్లనే ఎక్కువగా నామినేట్ చేశారు. అయితే, ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వారియర్స్ నుంచీ కూడా ఏకాభిప్రాయంతో ఇద్దర్ని నామినేట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పాడు. దీంతో అందరూ కలిసి డిస్కషన్స్ మొదలు పెట్టారు. అందరూ కలిసి మిత్రా శర్మాని ఇంకా ఆర్జే చైతూని నామినేట్ చేశారు. దీంతో జూనియర్స్ నుంచీ ఇద్దరు నామినేషన్స్ లోకి రావాల్సి వచ్చింది. మొత్తంగా ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే.. నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, మిత్రా, చైతూ లు నామినేట్ అయ్యారు. దీంతో ఈసారి సరయు డేంజర్ జోన్ లో ఉందా అనిపిస్తోంది.

ఎందుకంటే, లాస్ట్ సీజన్ లో కూడా ఇలాగే సరయు మొదటివారమే నామినేషన్స్ లోకి వచ్చి ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

[yop_poll id=”9″]

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus