గత మూడు సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు గుర్తున్నారా?

‘బిగ్ బాస్’ సీజన్ 4 సెప్టెంబర్ 6 నుండీ ప్రారంభం కాబోతుంది. ఎప్పుడూ జూలైలో మొదలయ్యే ఈ రియాలిటీ షో.. ఈసారి కరోనా వల్ల లేట్ గా ప్రారంభం కాబోతుంది. ‘కింగ్’ నాగార్జునే ఈ సీజన్ ను కూడా హోస్ట్ చెయ్యబోతున్నారు.అయితే ఈసారి కంటెస్టెంట్లు ఎవరు అనే విషయాన్ని ‘బిగ్ బాస్’ యాజమాన్యం గోప్యంగా ఉంచుతోంది. కొంతమంది పేర్లు బయటకు వస్తున్నప్పటికీ అదంతా ఫేక్ అనే వాదనా వినపడుతుంది.

సరే ఎంతకాదనుకున్నా ‘బిగ్ బాస్4 ‘ కంటెస్టెంట్ ల లిస్ట్ మరో 6రోజుల్లో తేలిపోతుంది అనుకోండి..! అయితే గత 3 సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు మరియు హోస్ట్ లను ఓ లుక్కేద్దాం రండి :

2017 జూలై 16న ‘బిగ్ బాస్ సీజన్ 1’ ప్రారంభం అయ్యింది. దీనిని ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా.. అర్చన, హరితేజ, సమీర్, శివ బాలాజీ, మధుప్రియ, కత్తి మహేష్, కల్పన, ఆదర్శ్, దీక్ష పంత్, నవదీప్, ధనరాజ్, ముమైత్ ఖాన్, కత్తి కార్తీక, ప్రిన్స్, సంపూర్ణేష్ బాబు, జ్యోతి వంటి వారు పాల్గొన్నారు. ఇక నవదీప్, దీక్ష పంత్ లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. సీజన్ 1 కు విన్నర్ గా శివ బాలాజీ నిలిచాడు.

2018 జూన్ 10న ‘బిగ్ బాస్ సీజన్2’ ప్రారంభమయ్యింది. ఈ సీజన్ ను నాని హోస్ట్ చేసాడు. కంటెస్టెంట్లుగా.. భాను శ్రీ, బాబు గోగినేని, గీత మాధురి, దీప్తి, పూజ రామచంద్రన్, కౌశల్, దీప్తి సునైనా, తనీష్, సామ్రాట్, తేజస్వి, కిరీటి దామరాజు, రోల్ రైడా, అమిత్ తివారి, నందిని రాయ్,సంజన అన్నె, గణేష్, నూతన్ నాయుడు,యాంకర్ శ్యామల వంటి వారు పాల్గొన్నారు.నందినీ రాయ్, పూజా రామచంద్రన్ వంటి వారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. శ్యామలా, నూతన నాయుడు ఎలిమినేట్ అయ్యి మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక కౌశల్ మందా ఈ సీజన్ కు విన్నర్ గా నిలిచాడు.

2019 జూలై 21న ‘బిగ్ బాస్ సీజన్ 3’ ప్రారంభమయ్యింది. ఈ సీజన్ ను ‘కింగ్’ నాగార్జున హోస్ట్ చేశారు. కంటెస్టెంట్లుగా… పునర్నవి భూపాలం, వరుణ్ సందేశ్, వితిక షేరు, శివ జ్యోతి, అలీ రెజా, రవి కృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, హిమజ, శిల్ప చక్రవర్తి, అషు రెడ్డి, హేమ, తమన్నా సింహాద్రి, మహేష్ విట్ట, జాఫర్, శ్రీముఖి, రోహిణి, బాబా భాస్కర్ వంటి వారు పాల్గొన్నారు. ఈ సీజన్లో తమన్నా సింహాద్రి, శిల్ప చక్రవర్తి వైల్డ్ కార్డ్ వంటి వారు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. మొదటి 50 రోజుల్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అలీ రెజా మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సీజన్ కు రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus