బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం అనిల్ కెప్టెన్సీ గురించి బిగ్ బాస్ ఆరా తీశాడు. అంతేకాదు, అనిల్ కెప్టెన్సీలో హౌస్ మేట్స్ రూల్స్ ని ఎలా అతిక్రమించారు ? ఎవరెవరు నిద్రపోయారు ? ఎవరు మైక్స్ మర్చిపోయారు అనేది చాలా క్లియర్ గా ప్లాస్మా టీవిలో చూపించి మరీ బిగ్ బాస్ అనిల్ కెప్టెన్సీ ని ప్రశ్నించాడు. ఇక హౌస్ మేట్స్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్లపై సీరియస్ అయ్యాడు. ఇది రూల్స్ అతిక్రమించడం అని, దీనికి ఆనందిచాల్సిన అవసరం లేదని వార్నింగ్ ఇచ్చాడు.
ఆ తర్వాత ఇంట్లో అందరూ అనిల్ కెప్టెన్సీ ని సపోర్ట్ చేసినా కూడా బిగ్ బాస్ మాత్రం క్షమించేది లేదని అనిల్ కెప్టెన్సీ ని క్యాన్సిల్ చేశాడు. అయితే, క్యాన్సిల్ చేసే ముందు హౌస్ మేట్స్ ఓటింగ్ ని అడిగాడు. అనిల్ కెప్టెన్సీ ని సపోర్ట్ చేస్తే వచ్చే రెండు వారాలు అతనిని నేరుగా కెప్టెన్సీ పోటీదారులుగా చేస్తానని, ఒకవేళ అనిల్ ని కెప్టెన్ గా రిజక్ట్ చేస్తే వచ్చే రెండు వారాలు కూడా అతను కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనలేడని చెప్పాడు.
దీంతో చాలాసేపు ఆలోచించిన హౌస్ మేట్స్ అందరూ కెప్టెన్సీకి సపోర్ట్ గా ఎక్కువగా ఓట్లు వేశారు. దీంతో కెప్టెన్సీ పోయినా కూడా అనిల్ కి బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా అయ్యింది. అనిల్ కెప్టెన్సీ సపోర్ట్ చేసిన తర్వాత అనిల్ కి నేరుగా రెండు వారాలు కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం వచ్చింది. దీనపట్ల కొంతమంది హౌస్ మేట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మనం కేవలం ఓట్లు వేస్తే డైరెక్ట్ గా కెప్టెన్సీకి వెళ్లిపోయాడు. మరి మనం టాస్క్ ఆడినోళ్లం పిచ్చోళ్లమా అంటూ మాట్లాడుకున్నారు.
అంతేకాదు, అలా ఎలా బిగ్ బాస్ సపోర్ట్ చేస్తాడంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. అనిల్ కి ఎవరెవరు ఓట్లు వేశారో కూడా లెక్కలు వేసుకున్నారు. ఇక్కడే తేజస్వి అనిల్ కి సపోర్టింగ్ గా మాట్లాడింది. అనిల్ కెప్టెన్సీలో రావాల్సిన ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి, నెక్స్ట్ వీక్స్ లో కూడా నువ్వు నేరుగా కెప్టెన్సీకి పోటీ చేయచ్చు కాబట్టి నీకు బంపర్ ఆఫర్ వచ్చినట్లే అని క్లియర్ గా ఎక్స్ ప్లైన్ చేసింది.
దీంతో మిగతా హౌస్ మేట్స్ కొంతమంది అనిల్ పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుకున్నారు. మరి రానున్న వారాల్లో ఈ రీజన్ తో అనిల్ ని నేరుగా నామినేట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.